Friday, October 22, 2010

అక్టోబరు నెల గడి - 2010

అక్టోబరు నెల గడిని కొవ్వలి సత్యసాయిగారు కూర్చారు. సత్యసాయి గారి గడి అంటే కొంచెం కష్టంగా, గందరగోళంగా ఉంటుంది మరి! నాకు తెలిసిన కొన్ని స్లిప్పులు ఇస్తున్నాను. ప్రయత్నించి చూడండి.


అడ్డం: 1.బహుజనపల్లి సీతారామయ్య గారి డిక్షనరీ!
3.ఇనుప కొమ్ములు విరగ్గొట్టి తోక తెగ్గొట్టండి.
13.బొడ్డూడిన గరిమనాభి.


నిలువు: 2.ఈ పజిల్ ఇలా ఉంది.
3.ప్రియం అంటే కాస్ట్లీ కాదు.
19.విరాళము లా ధ్వనించే హంస.

19 comments:

Ravi said...

నిలువు:
1: ఈమె అసలు రామాయణంలో లేదట...
అడ్డం:
6: "భారతాన క్రిష్ణుడేమి చేసినాడో" చిరు కూడా అదే చేసి ఈ విధంగా అయ్యాడంట

జ్యోతి said...

8 అడ్డం. అతడే ఒక సైన్యంలో జగపతిబాబుని జీవా ఇలా పిలుస్తాడు
18 అడ్డం. అత్త ఒడి పువ్వులా ఉంటే ఇలా ఆడుకోవచ్చు
27 అడ్డం.పెళ్ళిపుస్తకం లోని ఈ పాట విన్నారా...పపపప పప్పు....

అన్వేషి said...

అడ్డం:
15: కమ్యునిష్టులు సాధించాలనే సామాజకన్యాయం "వీటిని" రూపుమాపటమేగదా.
25: ఉండమ్మా బొట్టుపెడతా సినిమాలో జనరంజకమైన పాట మొదలెట్టండి.
33: మాయదారి ___ సూపర్స్టార్ కొద్దిగా మారాడు అంతే
నిలువు:
4: వేసవి లో సంఘసేవకులు వాడవాడలా ఏర్పటుచేసేవి (ఒకటే ఉంది ఇక్కడ)
7: క్షేమసమాచారం కాదు !
9: ప్రశ్నలోనే జవాబుంది - జాగ్రత్తగా పట్టుకోండి
10. సప్తస్వరాల్లో - బేసికాదు.
15. మన సినీ సారికానాధుని చిత్రం చూసేఉంటారుగా.
16. ఆ రవం నాది కాదు
17. ఆస్కారందుకు రహ్మను ముందు వీరి బృందంలో పనిచేశారుట
18. ఉగ్గు పట్టేదే గా.
20. చెమ్మ కి దగ్గర

అన్వేషి said...

పైన ఇచ్చిన నిలువు 17 స్లిప్పు పొరపాటుగా యివ్వడమయ్యింది, అది విడచిపెట్టండి.

mmkodihalli said...

ఈ క్రిందివాటికి స్లిప్పులు ఎవరైనా ఇవ్వగలరా దయచేసి?
అడ్డం: 11,14,21,26,29,31,32,36,37
నిలువు: 12,20,22,23,24,28,34,35,36

krishna said...

addam
21 samscrutalo raayandi "manasaa..."
26 edo guhalaagaa vunde
29 edo vachchi deenito mora pettukundata
niluvu
12 daanam chesevaadu
20 chikkagaa cheekati kaadu gaani alaage
22 gadiyaaralo vunde pitta
34 ...sahasranaam chadivite ladiesku manchidi
36 abbaa laaga cha...

అన్వేషి said...

కృష్ణ గారు - మీరిచ్చిన స్లిప్పులన్నీ నాకు కావలచినవే గాని, అవన్నీ (ఒకటి రెండు మినహా) కూడా గడిలో యిచ్చిన ఆధారాలతో సరిపోయేలా లేవు. మరోసారి యోచించండి.

aparanji said...

ఇవి నాకు తోచినవి

అడ్డం

31 ఇది వరకు యువ మాస పత్రిక ఉండేది దానిలో కధలు చాలా బాగుండేవి అనుకుంటే వాటికి వేసే బొమ్మలు చాలా బాగుండేవి ఆ బొమ్మల పాపయ్యగారిని తలుచుకోండి

32 హిందుస్తానీ భక్తి కీర్తనల కోసము చూస్తుంటే కనపడింది ఇది మన త్యగరాజ కీర్తన లా, ఇది ఎంతవరకు సరిపోతుందో తెలీదు. మొదటి అక్షరం తో సరి పోయింది. ద్రౌపతి తడ్రి రాజ్యం

36 తమకం లాంటి మరొక పదం

నిలువు

చీమ లో మొదట దీర్ఘం పీకి తరువాత మ వత్తు తగిలించి చూడండి

అన్వేషి said...

మురళీగారికి కావలసిన స్లిప్పులు కొన్ని:
అడ్డము:
11: నన్నే "నా" ?
32: కద్రువదా!
నిలువు:
12: గాంధీగారు మనజాతికి ?
20: చీపురు చేసే పని - చివరలేదు.
24: బేడకు అణాలు రెండేగదా!
28: ఒకయోగముద్ర (పానంకానిది)
34: మల్లయ్య గారి అర్ధాంగిని తలపించే ప్రాణాయామం
36: భీమునిచేతులో ఉండేదే గదా!
మిగిలిన స్లిప్పులు నాకూ కావాలి. ఎవరైనా ఇవ్వగలరా!

mmkodihalli said...

గడువు ముంచుకొస్తున్నా ఇంకా ఎవరూ ఈసారి గడిపై ఉత్సాహం చూపించటం లేదు ఎందుకో.

నాకు తెలిసిన మరొకటి

అడ్డం 37. ముత్తుస్వామి దీక్షితార్ గారి కృతి ధర్మసంవర్ధినీ అనే కీర్తన చూడండి.

నాకు కావలసినవి
అడ్డం:11,14,26 నిలువు:12,22,35

ఎవరైనా దయతలిస్తే ఈసారి గడిని గట్టెక్కించొచ్చు :-)

అన్వేషి said...

మురళీమోహన్ గారు:
37 అడ్డంలో - ధర్మసంవర్ధిని కీర్తనలోని ప్రయోగం సరిపోదు, పంచాశత పీఠరూపిణీ అనేకీర్తనలో చూస్తే ఇక్కడ సరిపోయే ప్రయోగం కనిపిస్తుంది.
మీరడిగిన అడ్డం 11, నిలువు 12 స్లిప్పులు నా 8వ తేదీ టపాలో వున్నాయి ఒకసారి చూడండి.
అడ్డం 14: మహిళాప్రజారాజ్యాని కి కాబోయే రాణిగా ప్రచారంజరుగుతున్నచిరుతనయ.
మీరడిగిన మిగిలినవాటితో పాటు: అడ్డం 5, 26, 29, 31 నిలువు: 4, 22, 23 కూడా నాకు కావాలి.

జ్యోతి said...

@ అన్వేషి
37 అడ్డం మీరు చెప్పిన కీర్తనలో 8 అక్షరాల పదమే ఉంది. గడికి 9 అక్షరాలు కావాలి.ఇంకేదైనా క్లూ ఇవ్వగలరా ?
14 అడ్డం: నేను "ఘల్లు ఘల్లుమని" పాట ఉన్న చిరంజీవి సినిమా అనుకున్నా.
5 అడ్డం. ఈ ఉడ్స్ ఆ మధ్య వార్తల్లో చాలా వచ్చాడు.
29 అడ్డం. మృదంగము,మద్దెలని ఇలాకూడా పిలవచ్చని బ్రౌన్ గారు చెప్పారు.
4 నిలువు. "చలి"తో మొదలయ్యే కుండ పెట్టే "కేం"ద్రము
30 నిలువు. రమ్యమైన రాజగృహము, య లేకుండా.

జ్యోతి said...

31 అడ్డం. బాపుగారంత ప్రముఖ తెలుగు చిత్రకారుడు, పొడి అక్షరాల్లో ఆధారంలోనే 1,2 పదాల్లో వున్నారు.
22 నిలువుకు క్లూ ఇవ్వగలరా ?

జ్యోతి said...

23 నిలువు. రమ్యమైన రాజగృహము, య లేకుండా. (30 నిలువు కాదు)

అన్వేషి said...

@Mahek.
అడ్డం 37: ఆ 8 అక్షరాల పదంలో 2వ సంయుక్తాక్షరాన్ని రెండక్షరాలుగా విడదీయండి (వత్తులు పలుకలేనివాళ్ళు అనేట్లు). నేనుచూసిన కృతిలో అలాగే ఉంది మరి.
మిగిలినవి కొంతగందరగోళంగానే ఉన్నాయి. చూడాలి ఏమాత్రం సరిపోతాయో

అన్వేషి said...

గడిపూరణకు గడువు పొడిగించారు చూసారా!

mmkodihalli said...

అక్టోబరు నెల గడి పూరణకు గడువును మూడుసార్లు పొడిగించి చివరకు పరిష్కారం ప్రకటించారు. మీ సమాధానాలను ఇక్కడ సరిచూసుకోండి.
http://poddu.net/?q=node/762/solution

Satyam said...

పొద్దు పత్రిక కొత్త సంవత్సరంలో ఇంకా ప్రచురింపబడలేదా? గడి చాలా మిస్సు అవుతున్నాను.

aparanji said...

మా పసలపూడి కధలు 'మా టీవీ'లో
రోజువారీ సీరియలు గా వస్తున్నది

వంశి మా ఫసలపూడి కధలు

మీరు నెట్లో చూడాలంటే మన తెలుగు మూవీస్ . నెట్ లో ఉంటాయి
అపరంజి

Post a Comment