అయ్యా...
పొద్దు పత్రికలో ప్రతి నెల ఒక గడి ఇచ్చి మాకందరికీ ఒక ఉపయోగకరమైన కాలక్షేపం అలవాటు చేసారు. కాని ఆరునెలలుగా కొత్త గడి ఇవ్వడం లేదు. ఏమో లే సంపాదకులందరూ బిజీగా ఉన్నారని అనుకుంటూ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నాం. కాని ఇక మా సహనం చచ్చిపోయింది. తొందరగా కొత్త గడి ఇవ్వగలరు. లేనిచో గడి ప్రేమికులందరూ కలిసి JAC ఏర్పాటు చేసుకుని ఏమి చేయాలా అని ఆలోచిస్తాం. అయినా కూడా ఇవ్వనంటారా?? ఏం చేస్తాం.. సైలెంట్ అయిపోతాం...
ఎన్ని శంకరభారణాలు ,మాలికలు వచ్చినా, రోజూ కొత్త ప్రహేళికలు, పూరణలు వచ్చినా సరే పొద్దువారి గడి మాత్రం మాకు కావాలి అంటే కావాలి... అంతే..
9 comments:
మరే, నా సంతకం కూడా పెడుతున్నా!
నిజమే .. అదొక ఉల్లాసకరమైన, ఉత్సాహభరితమైన అనుభవం. గడి నింపే ప్రయత్నాలూ, స్లిప్పులు ఇచ్చిపుచ్చుకొనడం, ఫలితాలలో పేరు చూసుకొని సంబరబడడం ... వీటన్నిటినీ "పొద్దు" వారు దూరం చేసారు.
నేనూ జే. ఏ. సీ. లో మెంబర్‌షిప్ కోసం అప్లికేషన్ పెడుతున్నా ....
అవును ఎవరెవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయినట్లున్నారు. పోనీ ఒకళ్ళే కాకపోయినా ఇద్దరు ముగ్గురైనా కలిసి ఇచ్చి మా డిమాండ్స్ నెరవేర్చాల్సిందిగా ధర్నా చేస్తున్నాం!
ఈవిషయంలో జ్యోతిగారికి నాపూర్తి మద్దతు నిష్షరతుగా ప్రకటిస్తున్నాను. జ్యోతిగారూ! మీరే ఓ గడి కూర్చి పొద్దువారికి పంపితే ప్రచురిస్తారేమో ప్రయత్నిస్తే బావుంటుందని నా సూచన. శంకరయ్యగారు చేపడితే గడి మరీ నారికేళపాకమై పోతుందేమోనని నాసంశయం.
పొద్దువారు ఇంతవరకు స్పందించలేదు కాబట్టి,, మాలిక పదచంద్రిక కోసం స్లిప్పుల సర్వీసు మొదలెడదాం.. ఏమంటారు??
పదచంద్రిక స్లిప్పుల కోసం చకోరపక్షుల్లా చూస్తున్నామండి! ఇంకాఎప్పుడు మొదలుపెడతారు, గడువుకూడా దగ్గరకొస్తోంది.
అన్వేషిగారు,,
పదచంద్రిక స్లిప్పులు ఇక్కడ లభిస్తాయి. మీరు మొదలెట్టండి మరి. గడువు వారంరోజులే ఉంది మరి..
http://padachandrika.blogspot.com/
సదరు చిరునామాలో, బహుమతిలో సగం పంచిస్తామన్నా, ఎవరూ స్పందించడం లేదు. ఏమిచేయడం చెప్మా!
నేను కూడా బోల్డు హాశ్చరిపోయి చదువరిగారిని అడిగితే తొందరలోనే మొదలెడతామని కూర్చడానికి రెడీ అయిపోమని చెప్పారు.....ఇప్పుడైతే పొద్దు నాకైతే తెరుచుకోడంలేదు. ఏమైందో ఏంటో...ఎవరైనా చెప్పగలరా?
Post a Comment