Tuesday, September 21, 2010

సెప్టెంబర్ నెల గడి - 2010

ఈసారి పొద్దువారు గడి ఫలితాలు చాలా తొందరగానే ఇచ్చేసారు. గత గడిని పూరించింది ఒక్కరే. వారే ఈసారి గడి కూర్పరులు. మరి ఈసారి కాస్త ప్రత్యేకమైన గడి ఇచ్చారు భైరవభట్ల కామేశ్వరరావుగారు. ముందుగా కొన్ని స్లిప్పులు..

అడ్డం.
2 . ఈజీనే. పది
26. నోటినిండుగా నీరు పట్టి ఏం చేస్తారు?
27. స్తుతించు

నిలువు
28 . మహాభారతం రాసినవారిలో రెండోవాడు.

12 comments:

కంది శంకరయ్య said...

పొద్దు గడి స్లిప్పులు
2. వంద శతమే .... అందులో పదిని చూడండి.
4. మహాత్మా గాంధీ మాతృభాష. మొదటి అక్షరం కీలకపదంలోకి.
6. ఐనన తేవలె నంటూ తలలు చూడండి.
8. ఈ పేరుతో పాన్ మసాలా ఉంది.
13. "సకియా! కనరావా?" పాటలో వెదకండి.
15. "అత డేమన్నాడే?" అంటున్న నటి. మొదటి అక్షరం కీలకపదంలోకి.
16. నితిన్ సినిమా. కృష్ణ సినిమా " .......... దొంగ, చక్కని చుక్క" మొదటి అక్షరం కీలకపదంలోకి.
19. దొర సణుగుడును బేసికంట కనుము.
21. రామదాసు కీర్తన పాడుకోండి. పగలు నీకేల?
23. వాడు సలాము చేస్తాడు. కనిపెట్టు.
26. కైపు ఎక్కి సోలి పోతావేం?
27. అనుమతిలో ఉందా?
29. కిరీటికి తెలుసు.
31. గవాక్షాలు. మొదటి అక్షరం కీలకపదంలోకి.
36. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరుకుతుంది.
38. వివేకానందుని గురువు పేరులో ఉత్తరార్ధం.
40. నగాలాండులో ఆనందంగా తిరిగి చూద్దాం.
41. కాంతం కథలు చెప్పినాయన ఇంటి పేరు.
42. త్యాగరాజు పంచరత్న కృతులు పాడుకోండి.
నిలువు
3. బాణంతో నిధిని కొట్టు. మూడో అక్షరం కీలకపదంలోకి.
4. జగడంలో ఉండదా?
5. కృష్ణుని ప్రేయసిని పిలిచి టం కొట్టండి.
9. నీలాల నింగిలో రమణులు మెరుస్తారా?
10. ఇంకొంచెం ... ఇంకొంచెం .. అంటూ తినిపిస్తే తోక తెగింది.
12. నల్లగొండలో పూసలమ్ముతున్నావా?
20. నీ కే పులుసు కావాలని అడిగి చూడు.
23. తలక్రిందులుగా ప్రణతు లిడు. దొరుకుతుంది.
24. అబద్ధాలాడెను వాడు. మధ్యామక్షరం కీలకపదంలోకి.
28. మనుమసిద్ధి ఆస్థాన కవి.
30. మొదటి బోణీ మీదే అంటుంది.
32. కీటకాలలో మణిదీపం.
33. తమసా నదిలా ఉండాలి. ఏలకులు, లవంగాలు మొదలైనవి కలిపి నూరండి.
35. దాశరథి రంగాచార్య నవల. ప్రథమాక్షరం లోపించింది.
36. అనేకపదంబులు ఏకపదం బగుట. రెండో అక్షరం కీలకపదంలోకి.
37. పనసలా ధ్వనిస్తుంది. చివరి అక్షరం కీలకపదంలోకి.

mmkodihalli said...

క్రింది వాటికి స్లిప్పులు కావలెను.

అడ్డం: 17,25, నిలువు:20

జ్యోతి said...

నాకు చాలా స్లిప్పులు కావాలి..
అడ్డం...13, 14,17,18,25,34,40

నిలువు.. 1,7,20,21,35

కంది శంకరయ్య said...

నేనిచ్చిన స్లిప్పులలో అడ్డం 40 "నగాలాండు" కాదు, అది "నాగాలాండు" గా చదువుకోండి.

అన్వేషి said...

పూరకులంతా మౌనంగా వున్నారా ! మిన్నకున్నారా !
కొన్నిస్లిప్పులు - కావలసిన వారికి:
నిలువు :
20 : చికిన్ తోకలసి "ఈ" జ్వరాలు ఈమధ్య అందర్నీ వణికిస్తున్నయిగదండీ (చివరి అక్షరం కీలక పదంలోకి)
21: నటి కి ముందొక పకారం చేరినట్లుంది.
35: శంకరయ్యగారి స్లిప్పు వివరంగానే వుంది - ఇంకా విపులంగా కావాలంటే సోనియాగారి ఇంటి చిరునామా చూడండి !
అడ్డం:
14: ఇటీవల సూపర్ హిటైన "విక్రమ్" సినిమా (మొదటి అక్షరం కీలక పదంలోకి)
25: పరమపద సోపానంలో పాములకు చిక్కకుండా పట్టుకోవలసినది.
34: ఏమికష్టమొచ్చిందో (అలా ఏడుస్తునారు)
40: పాముల సంతోషం.

నాకు కావలసిన స్లిప్పులు:
ఆడ్డం: 6,13, 17,18 నిలువు: 1,7,9,32,39

mmkodihalli said...

అన్వేషి గారికి కావలసిన స్లిప్పులు ఇవిగో:
అడ్డం:
6._తే గీతే ఇదే అవ్వాలి.
13.సంక్రాంతి పండుగకు తెలంగాణా ప్రాంతంలో చేసే పిండివంటకము (జంతికలను పోలినది) గుర్తుకు తెచ్చుకుంటే సరి!
17.ఏకాక్షర సంబోధనము ఏ/ఓ ఏదైనా కావచ్చు.
18.కన్నడ భాషలో రా మరో భాషలో కూడా అదే అర్థం వస్తుందిట(?)
నిలువు:
1.మంచికంటి కథాసంకలనం పేరు. మృత్యువుకు వికృతి. ఇంకా తెలియకపోతే నా తురుపుముక్క బ్లాగులో వినదగునెవ్వరుజెప్పిన... టపా సెర్చండి.
7.నటశేఖరుడి తొలి సినిమా. రెండో అక్షరం కీలకపదంలోకి.
32.శంకరయ్యగారి స్లిప్పు వివరంగానే వుంది - ఇంకా విపులంగా కావాలంటే వారు ఇచ్చిన స్లిప్పులోని పదాలలో చెరో మొదటి రెండక్షరాలు తీసుకోండి.

అన్వేషి said...

మురళిగారు - నెనర్లు
ఇక నిలువు 9, 39 వినా గడి పూర్తెనట్లే అనిపిస్తోంది

అన్వేషి said...

ఎవరైనా నిలువు 39 స్లిప్పుతారా

అన్వేషి said...

జ్యోతి గారు - అన్నట్లే ఈసారి చాలా జాగర్తగా ఉన్నట్లున్నారు - అసలు స్లిప్పులకేసి చూడకుండా !
నాబండి ఒక్కమెట్లో ఆగిపోయింది (స్లిప్పు - స్లిప్పయి).

జ్యోతి said...

అయ్యో! జాగ్రత్త కాదండి. ఇన్ని స్లిప్పులు ఇచ్చినా కూడా కొన్నిచోట్ల బల్బు వెలగట్లా. ఇంకా టైమ్ ఉంది కదా అనే అలసత్వం కూడా. బహుశా పండగ తర్వాతే గడి చూసే వీలుంటుందేమో?

అన్వేషి said...

గడి పరిష్కారం ప్రకటించారు - చూసారా !

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

వద్దు వద్ద్దనుకుంటూ చివరి నిమిషంలో పంపాను. అందిందో లేదో కూడా తెలీదు. పేరు ప్రస్తావించలేదు.

Post a Comment