గత నెల పొద్దు గడి స్లిప్పుల సర్వీసు వల్ల సందడి బానే ఉండింది కాని అందరూ పంపించనట్టుందే. ఎందుకలా??? తప్పైనా, ఒప్పైనా పంపండి. ఒకవేళ డౌట్ ఉంటే చివరి తేది కంటే ముందు మళ్ళీ పంపించొచ్చు . ఏమి కాదు.
ఇక ఈసారి గడి మన వీరబల్లె వీరుడు రానారె తయారు చేసింది. చూద్దాం. ఇది ఎలా ఉందో..
ముందుగా కొన్ని స్లిప్పులు..
10 . నిలువు. రాముడు భీముడు సినిమాలో మాధవ పెద్ది పాడిన ఫేమస్ పాట. ఒక్కసారి రేలంగిని గుర్తుతెచ్చుకోండి.
27. అడ్డం . ఈజీనే. తెలీదంటే వేమన గారు తిడతారు.
32. నిలువు . కొంతమంది పెద్దమనుష్యుల తీరు చూస్తే వాళ్ళ మెదడు ఇక్కడుంది అనిపించక మానదు.
17. అడ్డం . ఈ బిందెలు పెళ్ళిళ్ళలో కామనే. లాగించండి.
17. నిలువు. పాపం కృష్ణుడు ఈ పని చేసి, నారదుడికి సేవకుడు కావలసి వచ్చింది.
Wednesday, March 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
అసల ఈ slippula గోల ఎమిట నాకు చెప్పండి
చాలా వరకు రాసాను గాని కొంచెం డవుట్ డవుట్ గా ఉన్నాయి ..సరే నా క్లూలు చూడండి
1 అడ్డం.. ఒక పాటల రచయిత..
24.నిలువు .. రావణాసురిడి ఊరే ..
30..అడ్డం.. తానం పల్లవులకు జత అయినది..
25... ఫస్ట్ కీ తెలుగులో తర్జుమా చేయండీ
ఇక మర్యాదగా మీకు వచ్చిన వాటిలో కొన్ని చెప్పండి..
ఇప్పుడు నేను పైన చెప్పిన వాటిలో ఎమన్నా తప్పుంటే చెప్పాలమ్మా..లేకపోతే నేను ఒప్పుకోను :)
హర్షోల్లాసంగారు,
పొద్దు వాళ్లు నిర్వహించే గడి పూర్తిచేయడానికి మేము పడే తిప్పలండి. తెలిసిన క్లూలు ఇలా పంచుకుంటామన్నమాట.మీరు వచ్చేయండి మరి.
నేస్తంగారు,
టూమచ్ , బెదిరిస్తే పనులు కావమ్మా..
జ్యోతి గారూ, 17 అడ్డం, 17 నిలువు కి మీరు ఇచ్చిన స్లిప్ప్పులు అండర్ స్టాండింగ్ కాలేదు. ఇంకొంచెం క్లియరింగ్ ప్లీజ్.... :-)
పిచ్చోడుగారు,
17 అడ్డం... దీనికి శ్రీరామనవమికి అవినాభావ సంబంధముంది.
17 నిలువు ...కృష్ణుడు దొంగతనం చేసాడండి. ఈ కధ రాసింది ముక్కుతిమ్మన అనుకుంటా.
14 అడ్డం.. ప్రకాశ్ రాజ్ ఫేమస్ డవిలాగు ఇది.కాస్త పక్కకు జర గండి...
8. వాగ్గేయకారుడి ప్రతి కృతిలోనూ చివర ...
23. ఈ ఆదివారం " " అన్న పేరుతో ఓ టపా వచ్చింది. కూడలిలో వెతకండి.
19 నిలువు, 26 నిలువు, 31 అడ్డం స్లిప్పులు ఎవరితో అయినా ఉన్నాయా?
పిచ్చోడు గారు నేను ఇంకా వీజీగా చెప్పనా....
17 అడ్డం ..పెళ్ళిలో ముందు గా ఇదిచ్చే పెళ్ళివాళ్ళను ఆహ్వానిస్తారు
17 నిలువు పువ్వులలో ఫేమస్ పువ్వన్నమాట మన పురాణాలలో
ఇంక రవిగారు 31 నేను రాసాను మరి కరెస్టో కాదో పూర్తిగా చెప్పలేను మరి మీరు ట్రై చేయండి..
31 అడ్డం.. ..... కూడా మదురం కాదా అన్నారు గా చూడండి సరిపోతుందేమో
19 నిలువు కూడా కాసింత డవుటే రవి గారు సరే నేను రాసినది చెబుతా.. కరెక్ట్ కాకపోతే ఎవరన్నా చెప్పండి..
19 నిలువు లో చివరి సగభాగం .. ఈ కాలక్షేపానికి పెద్దవాళ్ళు గుళ్ళకు వెళతారు.. 19,23 అడ్డం వచ్చేస్తే మొదటి సగభాగం వచ్చేస్తుంది :)
19. అడ్డం - ఇల్లు గట్టిగా ఉండాలంటే ఇది ఉండాలి.
23. అడ్డం - కుంకుళ్ళతో అంటేది.
33,35,37....ఊహూ..అస్సలు తట్టడం లేదు...క్లూ ప్లీజ్...
నేస్తంగారూ(31 అడ్డం)....కూడా సుఖమేకాదా అని కదా అన్నారు మాయాబజార్ లో.మధురమయినది-నిరతము చింతన.
జ్యోతి గారూ, థాంకులు. మీ స్లిప్పులు అర్థమైపోయాయ్..
నేస్తం గారూ, మీకు కూడా ధన్యవాదాలు
సుధ గారూ, సేమ్ పించ్ :-) నాకు కుడా అవి ఆగిపోయాయి
33 నిలువు . ఇల్లాలికి ప్పర్యాయ పదం. అదేనండీ శ్రీమతి. (సరి పోతుందా?)
ఈనెల పొద్దు గడి సమాధానాలు లీక్ అయ్యాయని ఇప్పుడే తెలిసింది. అందుకే నేను గడి పంపించదలుచుకోలేదు. ఇక్కడ కూడ స్లిప్పులు ఆపేస్తున్నాను.
పొద్దువారుగాని, ప్రొఫెసర్ గారు కాని మరోగడి లేదా ఒక మినీగడి ఇవ్వాలని కోరుతున్నాను..
జ్యోతి గారూ, మీరేమనుకోనంటే ఒక మాట. పొద్దు గడి నింపే వాళ్ళలో చాలా మటుకు జుస్ట్ ఒక హాబీ గా, లేదా టైంపాస్ గానో చేస్తారు తప్ప పోటీ గానో, ప్రెస్టీజియస్ గానో చేయడం ఏమీ ఉండదు. అసలు సమాధానాలు ప్రచురించేటప్పుడు కూడా తప్పులు లేకుండా రాసిన వాళ్ళు, ఒక తప్పుతో పూర్తి చేసిన వాళ్ళు, ఇలా ప్రచురిస్తున్నారు తప్ప ఫస్ట్, సెకండ్ అని ఏమీ లేదు. ఒక వేళ గడి సమాధానాలు లీక్ అయినంత మాత్రాన నష్టం ఏముంది? అన్నీ సరిగా రాసి పంపే వాళ్ళలో కొందరు ఎక్కువ ఉంటారు, వాళ్ళు కుడా మన స్నేహితులే ఉంటారు. అంతే కదా.
నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోకండి
మీరు చెప్పింది నిజమే. కాని సమాధానాలన్నీ చెప్పేసాక , ఇక గడి చేయాలన్న ఇంటరెస్ట్ పోయింది. ఐనా పొద్దు వారిమీద కోపంతో సమాధానాలు చెప్పేసి ఏం సాధించారో అర్ధం కాలేదు.
Post a Comment