పొద్దు గడి కోసం మాత్రమె ఈ బ్లాగు మొదలెట్టాను.
ఈ నెల గడి ప్రొఫెసర్ గారు ఇచ్చారు. నాకైతే కాస్త సులువుగానే అనిపించింది చూడగానే. ముందుగా కొన్ని స్లిప్పులు.....
25 నిలువు .. విశ్వనాధ్ సినిమా రాధిక పాడిన జోల..
29 అడ్డం .. పైది వస్తే ఇదీ వచ్చినట్టే.
31 అడ్డం ... ఆశా పారేక్ అభినయించిన ఫేమస్ పాట.
30 నిలువు.. మొదటి రెండు పదాలు వెంకటేష్ ,సౌందర్య నటించిన హిట్ సినిమా..
21 అడ్డం.. ఈ నటి రిక్షావోడి తల్లి..
10 అడ్డం.. మన పి.ఎస్.ఎమ్ లక్ష్మిగారు తరచూ రాసేది అదేగా..
Monday, February 9, 2009
Subscribe to:
Post Comments (Atom)
41 comments:
అన్యాయం- ఏకంగా స్లిప్పుల సర్వీసుకోసం ఓబ్లాగే పెట్టేయడం. వా.... ః)
ముంబైలో లోకల్ ట్రైన్స్ లో మరాఠీ పేపరులో క్రాస్వర్డు ఒంటికాలి మీద నుంచుని, చేసేవాళ్ళు కనిపిస్తారు - రెండుకాళ్ళమీద నుంచునేంత చోటుండదుగా మరి!. మీరు గడికి అలాంటి ఫేన్ ఫాలోయింగ్ తీసుకొస్తున్నారు. అభినందనలు. ఆల్ ది బెస్ట్.
జ్యోతి గారు,
31 అడ్డం ఆషా పరేఖ్ పాడిన పాట అనుకొంటాను.
44 అడ్డం కు క్లూ ప్లీస్ .
medam podhu gaddi stippula service
chaala baagundhi all the best
సత్యసాయిగారు,
గడి చేయాలని ఉంటుంది. కొన్ని తెలిసినవే ఉంటాయి. కరెక్టో కాదో తెలీదు, తెలీనివి ఉంటాయి. అందుకే ఈ స్లిప్పుల గోల.. దీనికి ఆద్యులు మాత్రం సుగాత్రిగారే. ఎందుకో వారు కనపట్టంలేదు. ఎవరు బందించారో ఏమో? ఐనా వారి స్పూర్తిని కొనసాగించాలిగా. అందుకే ఈ బ్లాగు..
నిలువు: 1, 23,40
అడ్డం : 26, 36,39
స్లిప్పులు ప్లీజ్......
అడ్డం.
26 . దేవుడితో ప్రయోగం చేసి చూడండి..
36.. భగవంతుని దర్శనం కోసం ఎన్ని నోట్లైనా తృణప్రాయంగా ఖర్చు పెడుతున్నారు.. ప్చ్..
జ్యోతక్కా... థాంక్స్ :-) . మరి మిగిలిన స్లిప్పులూ....
@కృష్ణుడు : కృష్ణుడు గారూ, అడ్డం ౪౪ ఆధారంలోని పదాలను వరుసగా కొంచెం రూపం మార్చి ప్రయత్నించండి అంతే. చేసారంటే సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి లాంటి గొప్ప వాళ్ళ పక్కన నిలబెట్టేయచ్చు మరి :-)
నాకు ప్రస్తుతానికి 32 నిలువు ఇంకా 39 అడ్డం చెబితే మళ్ళి వచ్చి మిగిలినవి అడుగుతా :)
నేస్తంగారు,
32 నిలువు చాలా వీజీ కదా. సూర్యుడిని రివర్సులో అస్తమించనివ్వండి..
జ్యోతిగారు థాంక్స్ అండి 20 అడ్డం సెకెండ్ అక్షరం తెలిస్తే చెప్పరూ ,ఈ నిలువు 7 వచ్చేసింది కాని దాని మీనింగ్ అర్దం అయి చావడం లేదు నాకు ..కరెక్టో కాదో ..ఇంకా 23 నిలువు చెప్పెసి కాస్త పుణ్యం కట్టుకోండి నిన్న 1 వరకు కుర్చున్నా మా ఆయన ఒకటే తిట్లు :(
@నేస్తం
20 అడ్దం-రెండవ అక్షరం గ్రీనులో వుంటుంది చూడండి.
23 నిలువు-దాసుని తప్పులు దండంతో సరి-ఆ దండనని కాస్తంత మార్చి చూడండి, లేకపోతే ఉందిగా బ్రౌణ్యం..
మువ్వా గారు బోలెడు దేంక్యూలు.. మరిమో నాకు ఇంకా చాలా క్లూలు కావాలి
23 మీరు చెప్పినట్లు చేస్తే 6 నిలువు సరిగా రావడం లేదు,పోనీ 6 మద్య అక్షరం కాస్త చెబుదురు సరిగా రాసానో లేదో ఒక సారి చూసుకుంటా లేక పోతే మళ్ళీ క్లూ అడుగుతా :( .. ఇంకో డవుటేంటంటే బైరాగులు తినే దాన్యం ఆ బైరాగుల్లోనే ఉంది కదా???? లేక మరే దైనానా ????అవును చెప్పడం మరిచిపోయా అండి మీరు చదువరిగారి waif నా ??? మొన్న మీ టపాలన్నీ ....అన్నీ అంటే అన్నీ కాదు కొన్ని చదివా అన్నమాట అప్పుడు తెలిసిపోయింది :)
నేస్తంగారు, మీకు స్లిప్పు కాదుగాని,ఒక్కదాని సమాధానమే చెప్పేస్తాను పొద్దు ప్రిన్సిపాల్ గారి సతీమణి సరిగమల వరూధినిగారే :)
జ్యోతి గారు :)
sorry wife spelling తప్పురాసా
Thank you నేస్తం గారు ,
అలాగె 14 అడ్డం క్లూ ప్లీస్ .40 నిలువు కూడా .
నాకు
1 నిలువు, 6 అడ్డం, నిలువు కాస్త చెప్పుదురూ!!
జ్యోతి గారు 1 నిలువు దశరదుని భార్యలు లో ఒక భార్య పేరుతో మొదలవుతుంది కాకపోతే క్రింద నుండి పైకి ,క్రిష్ణుడు గారు 40 నిలువు తిరుపతిలో దేవుని పేరు
ఒకటి నిలువు - కాస్త "పంత్(తం)" వీడి హిందీ కవెవరు అని గూగులించండి.
6 అడ్డం - సమాధానం రాయాలంటే హిందీ అంకెలు వచ్చుండాలి
6 నిలువు - సూర్యుడంటే అర్కం కూడా. కానీ హనుమంతుడు బాలుడైనపుడు, సూర్యుడూ బాలుడే అవ్వాలి కదా
14 అడ్డం - బట్టలమీదైతే మరకలు మరి టీ మీదైతే ????? మరకల్లాంటివే
40 నిలువు - అదే పేరుగల ఓ వర్ధమాన తార ఇటీవల హత్యకి గురయింది లెండి.
ఇంకా స్లిప్పులిస్తే నన్ను బహిష్కరిస్తారేమో గడి లోంచి :-)
ఓరి దేవుడొ వికటకవి గారు నేను గూగిలించి పట్టుకున్న 40 నిలువు తప్పు అంటారా :( thanks andi
క్రిష్ణుడుగారు మీకిచ్చిన క్లూ తప్పండి అయితే sorry
వికటకవిగారూ,
ధాంక్సండీ...40 నిలువుకి మంచి క్లూ ఇచ్చారు....ఇంక 23 నిలువు ఒక్కటే మిగిలిపోయింది. దానికి కూడా నేను తెలివిగా ఆలోచించేలా మంచి క్లూ చెప్పేద్దురూ..ప్లీజ్..ప్లీజ్...
23 నిలువు : అంతా మాయ. ఆ "మాయ" ఏమిటో మరో రకంగా తెలుసుకోవాలంటే మీరు బ్రౌణ్యం తిరగెయ్యాల్సిందే. ఆశ్చర్యంగా, వ్యాపారానికి సమానార్ధమైన హిందీ పదం అందులో ఇమిడిపోయింది.
వచ్చేసిందోచ్...వికటకవిగారు మంచి క్లూలివ్వగలరు...థాంక్స్.ఇంక ఎవరెవరికి ఏవి రాలేదో చెప్పేయండి...నేను కూడా సహాయం చేస్తా...జ్యోతిగారూ..మీక్కూడా ఇలాంటి కూడలి పెట్టినందుకు థాంక్స్...
ష్.... సుధగారు.. అలా గోల చేస్తే పొద్దు సార్లు వచ్చేస్తారు. మెల్లిగా స్లిప్పులిచ్చుకోండి.:)
వికటకవిగారు,పర్లేదండి. మీరేమీ సమాధానాలు చెప్పడంలేదుగా. చిన్ని, చిన్ని స్లిప్పులు మాత్రమే. అవి కూడా ఆలోచించాలిగా.. :)
అప్పుడు సుధగారు 22 అడ్డం కొంచం వీజీ గా క్లూ ఇచ్చుకోండి :)నేను రాసింది కరస్టోకాదో..
అవునవును, 20 అడ్డం సరిగా రాకపోతే, 23 నిలువు కష్టం.
క్లూ ఏంటంటే, మీరు గతంలో ఈటీవీ చూసుంటే, అందులో ఓ దిక్కుమాలిన జిడ్డు సీరియల్ (సుమన్) ఇదే పేరుతో వస్తుండేది. ఆ పేరుని పట్టుకుని, ఆ చిట్టి పదాన్ని తీసుకుని దాన్ని మరికాస్త చిత్రవధ చెయ్యగలిగితే వచ్చినట్లే. (ఇంత దూరం వచ్చాక మీకు ప్రశ్నలోనే దాక్కున్న సమాధానం తెలిసిపోతుంది). అలానే 23 నిలువు ముందు పూరిస్తే మరింత సులువు. మొత్తమ్మీద అది చిత్రవధ చెయ్యబడ్డ అందమైన చిట్టి పదం.
అయ్యో, నేనిచ్చిన క్లూ 2౦ అడ్డం కాదు 22 అడ్డమే.
22 అడ్డం..
అసలు మీకు నాకు ఏంటి సంబంధం ???
ఏమిటి జ్యోతిగారూ,మరీ అలా అనేసారు..మనమధ్య ఎంతోకొంత సమ్..లేదంటారా..నేస్తంగారూ..ఆలోచించండి.(జయసుధలా పలకాలి మరి.అదే క్లూ.)
జ్యోతి గారు 22 అడ్డం మీరు ఇచ్చిన క్లూ లోనె ఉంది కదాండి? వికటకవి గారు చెప్పిన జిడ్డు సీరియల్ బట్టి చెపుతున్నా :)
వికటకవిగారు, 23 నిలువు మాయ అంటే మ్యాజిక్ నా? హిందీ వ్యాపారం అంటే మన తెలుగు రౌడీలు చేసే దానితో మొదలవుతుందా? :-?
22 అడ్డం కరక్టే, కానీ ముందే చెప్పినట్లు ఆ పదాన్ని ఈ కాలం తెలుగు యువత ఎలా పలకుతారో అది కావాలి.
23 మాయ మ్యాజిక్ కాదు. బ్రౌణ్యం చూడండి. పైది వస్తే ఇంకా సులువు, వెతకటానికి.
అయ్యో నేను సినిమాలు చూసి 15 ఏళ్ళు అయ్యింది.ఇంక సినిమా తారల సంగతులెలా తెలుసుకునేదిరా భగవంతుడా?.ఫొద్దు స్లిప్పులు కఊడా సినిమాతారల గురుంచి ఇస్తె ఎలా రా భగవంతుడా??????
నాకు కొంచం కూదా తెలియదమ్లెదు 40 స్లిప్పు గురుంచి.
గత 2 నెలల ఈనాడు కూడా చదివాను.?????????????
బ్రౌణ్యం లింక్ ఎవరైనా చెప్తారా?
నాకు వచ్చిన లింక్లు ఒక్కతీ పనిచెయ్యతం లెదు?
కృష్ణుడుగారు,
ఇది బ్రౌణ్యం లింక్..
http://dsal.uchicago.edu/dictionaries/brown/
40 నిలువు. సినిమా తార సంగతి వదిలేయండి. రాముడికి గల మరో పేరు అది. 43 అడ్డం వస్తే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది.
ఎండాకాలం మొదలైంది కదా.. లో వోల్టేజి సమస్య.. 6 నిలువులో నాలుగో పదం, 8 అడ్డంలో రెండో పదం వెలగడం లేదు. గడి పూర్తిచేసిన అమ్మలు, అయ్యలు కాస్త చెప్పరూ???
8 అడ్డం మద్య పదం చ గుణితంలో వస్తుంది' చు డండి ':)
స్లిప్పుల కోసమే బ్లాగా?? టూ మచ్..
మీ ఉద్దేశం నాలుగో అక్షరం, రెండో అక్షరం అనుకుంటా..
6 నిలువు, "మంగాంబుధి హనుమంత నీ శరణ
మంగవించిమి హనుమంత" అనే అన్నమయ్య కీర్తన విన్నారా ఎప్పుడైనా.. వింటే వెంటనే వచ్చేస్తుంది.
8 అడ్డం, అయ్యే ఈ పదాన్ని ఎలా చెప్పాలి .. చాలా కామన్ గా వాడేదే. కేవలం పప్పులో ఊరమిరపకాయే కాదు. పెరుగులో అరటికాయ ని ఇలాగే తినేది. పెరుగులో ఆవకాయ ముక్కని కూడా. ఇంకా వెలెగక పోతే జదే జవు జన్ని జ గుణింతంలో అడగండి.. ఆ ఒక్క అక్షరం చెప్పేస్తాడు.
దైవానిక గారు మావైపు అదేమాట జ తో కాకా 'చా గుణింతం లో అంటాం ,మరేది కరెక్ట్ అవుతుంది అంటారు ..???
43 అడ్డం 39 అడ్డం క్లూ ప్లీజ్ :)ఇదైపోతే అడగనుగాక అడగను ప్రామిస్,కోల్గేట్
నేస్తం, అచ్చ తెలుగు 'జ'కారమే. మీరన్నాక బ్రౌణ్యం కూడా చూసా. ఒకే పదానికి చాలా వికృతులు ఉంటాయి కదా. సో 'చ' కారం తోకూడా ఒక వికృతి ఉండి ఉంటది.
43 అడ్డం మసీదునే ఇలా కూడా అంటారు. ఆ కనకదుర్గ మీద ఆన :)
39 అడ్డం కర్ణాటక సంగీత త్రయంలో ఒకరి సంతకం ఇది. అసలుగా అయన రాసిన పాటలన్ని అమ్మవారి మీదే కాని సంతకం మాత్రం నల్లనయ్య గా ఉంటది :)
Thnak you జ్యోతి గారు.
8 అడ్డా నికి స్లిప్పు పెరుగన్నమ్లోనికి ఊరగాయను ఎలా తింతారో అది రాయండి అక్కడ.
23 నిలువు ప్లీస్ .
23 నిలువు-దాసుని తప్పులు దండంతో సరి-ఆ దండనని కాస్తంత మార్చి చూడండి
దైవనిక గారు జ్యోతిగారు కవి గారు సిరి సిరి మువ్వాగారు దన్య వాదాలు :) పంపేసా :)పంపగానే అదేదో బాష వచ్చింది ...చూద్దాం చేరిందో లేదో
Post a Comment