ఈనెల గడి భైరవభట్ల కామేశ్వరరావుగారు ఇచ్చారు. ఈసారి కాస్త వెరయిటీగా ఉంది.. వేసవి సెలవులు కదా బుర్రకు కాస్త ఎక్కువ పదును పెట్టాలి మరి...
ముందుగా కొన్ని స్లిప్పులు ...
18. నిలువు . రాజులు ఉండే భవనం ...
18. అడ్డం. వేసవిలో తప్పని వాత...
29. అడ్డం. పిల్లలు ఆడుకునేవి...
Saturday, April 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
అడ్డం స్లిప్పులు: (నిలువు స్లిప్పులు తరువాయి వ్యాఖ్యలో)
41 పోతనగారు చింతించింది దేనిని చేరుటకునై?
1 ఇదేదో కందకు సంబంధించిన బ్లాగు పదంలా ఉందే
3 పిల్లలూ! కాస్త "గంగిగోవుపాలు" పద్యాన్ని వల్లె వేయండ్రా!
6 ఇదొక వింత లేండి
7 ఎండాకాలంలో ఈ ఊరెళ్ళద్దండోయ్! కని మొదటి అక్షరాన్ని కాస్త కుదించి రుచికరమైన తమిళ గారెని తినండి
8 పాత సూపర్స్టార్ కృష్ణ సినీమాలో అయిదో అక్షరం కాస్త మార్చండి
10 దీనికి క్లూ కూడా అక్కరలేదు 10 నిలువుతో ఇది కూడా వచ్చేస్తుంది
11 హా! బృహస్పతీ!!!
13 హిందిలో పుస్తకాన్ని "పుస్తక్" అంటారా? అబ్బే! కాస్త ఉర్దూ నేర్చుకోండి మరి !!
17 చిరంజీవి చిన్నప్పుడు ఈ " రాయుడు" కానీ తిరగబడ్డాడు ( ఇది రూఢిగా తెలియదు - 17 నిలువు ఇంకా రాలేదు)
19 సరైన సమాధానానికి పేపర్లు దిద్దేవారు ఇంగ్లీషులో పెట్టేది
20 తెలుగుదేశంలోంచి కాంగ్రెస్ లోకి ఇటివలే దూకిన పాతకాలం నాటి నటీమణిని గుర్తుచేసుకుంటూ భారతంలో నన్నయ గారి ఆఖరి పద్యాన్ని చదవండి
22 తిరగబడిన "ఫ్రంట్" / "ఎహెడ్"
23 సులభంగా ఉండే మిడత
25 శ్రీ శ్రీ గారికి జైకొట్టి ప్రపంచ సౌఖ్యానికి పాటుపడండి
27 "హల్వా" కి తోక తెగి మొండెం సాగింది
28 కారం తోకతో ముగిసే హ్యూమన్ బాడీ
29 అందమైన అమ్మాయిలని బాపు సృష్టించేవాటితో పోలుస్తారు
30 అడ్డం 41 నుండి అక్షరం అప్పు తెచ్చుకున్నావా కొడకా?
31 తోక తెగిన సగం నెల
32 రామోజిరావునే భయపెట్టిన కాంగ్రేస్ నాయకుడి ఇంటి పేరులో మొదటి రెండక్షరాలని ఎవరో తినేశారు
33 "రాజేష్" సృష్టికర్త తలకాయ
34 కొబ్బరి కోరుకుంటావా? సరే కానీ!!
35 తోక తెగిన గెస్టు
36 ఎడ్జో ఎడ్జి
38 యముడి చేతిలో ఉండేది కాస్త సాగింది
39 పైనుండి అక్షరం అప్పు తెచ్చుకుని గారెతో కొట్టు
40 సీతమ్మవారికి ఇది చేయించాడనేగా రామదాసుని జైల్లో పెట్టింది?
నిలువు స్లిప్పులు
1. "పల్సర్" రాకముందు బజాజ్ మోటార్ సైకిళ్ళ మొదటి పదం
2. అడ్డం 1, అడ్డం 7 వస్తే పైనుండి పచ్చిన అక్షరంతో ఇది వచ్చేసినట్టే. అయినా తెలియకపోతే "స్లిప్పుల బ్లాగు సృష్టికర్త" అసలు బ్లాగులో సెప్టెంబరు 23, 2008 పోస్టు చూడండి. - నాకు కూడా ఆ సృష్టికర్తే వేరే క్లూ ఇచ్చారు - ధన్యవాదాలు
3. నిజం కాని నిజం - ఐరన్ ఓర్, లైంస్టొన్
4. పైనుండి అక్షరం అప్పు తెచ్చుకుని ఇండీయాలో "మోస్ట్ ఫేమస్ మహిళా రిపోర్టర్" తోక తెంచి తలగు తగిలిస్తే మేలి ముసుగైపోతుంది
5. నా పెళ్ళి ఇదే నెలలో అయ్యింది సుమండీ. కావాలంటే రౌడీ రాజ్యం బ్లాగులో నా శుభలేఖ చూడండి
6 సన్నేగాని సూర్యుడు కాడు
8 ".... మన్నుతినంగనే శిశువునో, ఆకొంటినో, వెర్రినో!"
9. గణితశాస్త్రంలో ఇది భారతీయులు కనిపెట్టిందే - కానీ తిరగబడింది
14. "డ్రైవర్ రాముడు" సినిమాలో "వంగమాకు" పాట వినండి. ఒక చరణంలో "ఈత ముల్లు, గుచ్చుకుంటే..." లైన్ వింటే మీకు క్లూ దొరికేస్తుంది. "పాం" అంటూ కూర్పరి కూడా పెద్ద క్లూ ఇచ్చేశారాయే!
15. పైనుండి అక్షరం అప్పు తెచ్చుకుని కత్తి మహేష్ కుమార్ కి జైకొట్టండి
16. సంధీ కాదు నిగ్రహము కాదు. అస్సలు లాభం లేదు
17. ( ఇది ఇంకా రాలేదు - ప్రయత్నిస్తున్నా )
18. అక్షరం మల్లీ పైనుండి అప్పు తెచ్చుకుంటే ఇంగ్లీషు బొగ్గు కాస్తా పెద్ద కట్టడమైపోతుంది. అర్ధం కాలేదా? సరే ఒక ప్రఖ్యాత తెలుగు విలన్, కారెక్టర్ మరియు హాస్యనటుడి ఇంటిపేరే దీని క్లూ
21 ఏమిటి అక్షరం తెగి, మధ్యలో కుదించుకుపోయిన రసాభాస?
23 అయ్యో శవపరీక్ష కాదండీ బాబూ! అక్షరం అప్పు తెచ్చుకుని "వ"
కారాన్ని తొలగించండి
24 (ఇది ఇంకా రాలేదు - ప్రయత్నిస్తున్నా)
25 చిన్న పిల్లల దేవుడితొ తల్లి కలిసిపోయింది. కానీ అక్షరం పైనుండి అప్పు తెచ్చుకుంటేనే!
26 నక్షత్రముతో మొదలయ్యి అంకముతో అంతమయ్యేది
27 అక్షరం అప్పుతో విష్ణుమూర్తి బురుజు నుండి రాకెట్ ప్రయోగం!
29 పిల్లీ బల్లీ కాదు - ఇదో వ్యాధి
31 వానాకాలంలో వేడి వేడి చాయ్ తో పాటు జనాలకిష్టమైనది వ్యావహారికంలో తోకతెగి, మొండెం కుదించుకుఫొయిన పక్కవాడా?
32 "మేరే సనం" బిస్వజీత్ జీప్ సూపర్ హిట్ పాట మొదటిపదానికి పర్యాయ పదం - ఇంతీ కాదు, తంతీ కాదు
35. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో సూపర్ హిట్ అనబడే ఓ దిక్కుమాలిన పాట ఈ పదంతోనే మొదలవుతుంది (చిరంజీవి / ఇళయరాజా అభిమానులూ, కోపంతెచ్చుకోకండి)
36. "... జీవితానా వెలుగింతేనా?"
37. అక్షరం అప్పుతెచ్చుకుంటే తెలుగులో "ఏక్టివ్" అయిపోతారు
38. నా స్లిప్పులు చూసి చూసి "రోత" పుట్టిందేమో మీ అందరికీ? ఇక ఆపేస్తున్నాలెండి.
ALL THE BEST!!!!!!!!
బాబోయ్! ఇంత రౌడీయిజమేంటండి బాబూ! గడి పెట్టిన మర్నాడే మొత్తం మరో క్లూల సెట్టు తయారుచేసేసారు! అయినా పర్లేదు, ఈ క్లూల కన్నా నేనిచ్చిన క్లూలే సులువుగా ఉన్నట్టున్నాయి :-)
"చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో సూపర్ హిట్ అనబడే ఓ దిక్కుమాలిన పాట ఈ పదంతోనే మొదలవుతుంది (చిరంజీవి / ఇళయరాజా అభిమానులూ, కోపంతెచ్చుకోకండి)" - అదుర్స్!
17, 24 niluvu kUDA vachchESaayOch vu -
17 niluvu - akshatalu kaavu, raatrulu kaanE kaavu - padam maatram chellaachedurayyimdi
18 mIkU amdamE, maakU amdamE!!
17, 24 నిలువు కూడా వచ్చేశాయోచ్ -
17 నిలువు - అక్షతలు కావు, రాత్రులు కానే కావు - పదం మాత్రం చెల్లాచెదురయ్యింది
18 మీకూ అందమే, మాకూ అందమే!!
కామేశ్వర రావు గారూ, ఇప్పటికి దీనిమీద కూర్చుని 3 గంటలయ్యింది - మీ వెరయిటీ అమోఘం!!!
OOPS for got 12 Down
12 నిలువు
ఆంధ్రా సిడెడ్ పరవాలేదు గానీ మూడోది అక్షరం అప్పుతెచ్చున్నా మధ్యలో కుదింపబడింది
10 నిలువు
"పుటుక్కు జరజర ... "
భరద్వాజ్ గారు, చాలా ధాంక్స్...
కామేశ్వరరావుగారు,, మరి విద్యార్థులా మజాకా. !!!
ఇక ఈ క్లూల పని పట్టాలి..
41 అడ్డం
39 అడ్డం
23 అడ్డం, నిలువు
25 అడ్డం
20 అడ్డం
24 నిలువు
16 నిలువు
నాకు ఇక్కడ బల్బు వెలగడంలేదు. ఇంకాస్త ఈజీ స్లిప్పలు ఇవ్వండి ఎవరైనా...
23 అడ్డం: మిడతకి మరో పేరు
23 నిలువు: కర్ణుడి సారధి ఎవరు?
25 అడ్డం: పల్లెటూరు (1952) సినిమా పాటలు వినండి
20 అడ్డం: భారతంలో నన్నయగారి ఆఖరి పద్యం ఏమిటి? పావలాకి రెండు రూపాయల నటన చేసే సరస్వతీదేవి పేరుగల నటి మరొక క్లూ
24 నిలువు: అంతకన్నా ఈసీ క్లూ అంటే తెలియట్లేదు - సమాధానమే చెప్పెయ్యాలేమో
16 నిలువు: పంచతంత్రం
ఇక 41 అడ్డం వస్తేగానీ 39 అడ్డం రాదు
భరద్వాజ్ గారు,
కామేశ్వరరావుగారు పెట్టిన కొత్త ట్రిక్ అర్ధం కాలేదు. ఇప్పుడు తెలిసింది.. :)..
నేను గడి పూర్తిచేసానొచ్,, ఎవరికన్నా సాయం కావాలా??
I don't think the answer for 9 down is related to that number. The clue given doesn't really fit properly. Moreover it requires to change two letters in the (more popular)answer of 8 cross. Cosidering the pain taken to create the puzzle, there should be some other better answer. I got all the rest. lets rethink about 9 down.
రౌడీ గారు ఇక్కడ కూడా రాజ్యమేలుతున్నారా?:))
1 అడ్డం 6 అడ్డం దయ చేయండి
6 అద్దం లో అక్షరం కలుస్తున్నట్టు లేదు
ఒకటి అడ్డం .. :: గుంపు ??
1 అడ్డం ... పూలదండని ఇలా కూడా అంటారు.. ముందుగా 'కదం' తొక్కాలి..
6. అడ్డం.. స్కూల్లు తెరవగానే పిల్లలకు అన్నీ కొత్తవి కొనాల్సిందే...
1 నిలువు (1 అడ్డం కూడా ) 2 నిలువు ,4 నిలువు
25 అడ్డం , 12 నిలువు ,41 అడ్డం వీటికి ఎవరైనా క్లూలు ఇవ్వరా ప్లీజ్
గడి పంపించేశాను:)
sriluగారు,
స్లిప్పులు అడిగి వాటికి సమాధానం రాకముందే గడి పూర్తిచేసారా? గుడ్.. ఇవాళే ఆఖరుతేది కదా..
Post a Comment