Wednesday, April 27, 2011

పొద్దు వారికి వినతి

పొద్దు పత్రిక వారికి పెద్ద విజ్ఞప్తి.. దీనిగురించి ఎటువంటి చర్య తీసుకొని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.
అయ్యా...
పొద్దు పత్రికలో ప్రతి నెల ఒక గడి ఇచ్చి మాకందరికీ ఒక ఉపయోగకరమైన కాలక్షేపం అలవాటు చేసారు. కాని ఆరునెలలుగా కొత్త గడి ఇవ్వడం లేదు. ఏమో లే సంపాదకులందరూ బిజీగా ఉన్నారని అనుకుంటూ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నాం. కాని ఇక మా సహనం చచ్చిపోయింది. తొందరగా కొత్త గడి ఇవ్వగలరు. లేనిచో గడి ప్రేమికులందరూ కలిసి JAC ఏర్పాటు చేసుకుని ఏమి చేయాలా అని ఆలోచిస్తాం. అయినా కూడా ఇవ్వనంటారా?? ఏం చేస్తాం.. సైలెంట్ అయిపోతాం...

ఎన్ని శంకరభారణాలు ,మాలికలు వచ్చినా, రోజూ కొత్త ప్రహేళికలు, పూరణలు వచ్చినా సరే పొద్దువారి గడి మాత్రం మాకు కావాలి అంటే కావాలి... అంతే..

Friday, October 22, 2010

అక్టోబరు నెల గడి - 2010

అక్టోబరు నెల గడిని కొవ్వలి సత్యసాయిగారు కూర్చారు. సత్యసాయి గారి గడి అంటే కొంచెం కష్టంగా, గందరగోళంగా ఉంటుంది మరి! నాకు తెలిసిన కొన్ని స్లిప్పులు ఇస్తున్నాను. ప్రయత్నించి చూడండి.


అడ్డం: 1.బహుజనపల్లి సీతారామయ్య గారి డిక్షనరీ!
3.ఇనుప కొమ్ములు విరగ్గొట్టి తోక తెగ్గొట్టండి.
13.బొడ్డూడిన గరిమనాభి.


నిలువు: 2.ఈ పజిల్ ఇలా ఉంది.
3.ప్రియం అంటే కాస్ట్లీ కాదు.
19.విరాళము లా ధ్వనించే హంస.

Tuesday, September 21, 2010

సెప్టెంబర్ నెల గడి - 2010

ఈసారి పొద్దువారు గడి ఫలితాలు చాలా తొందరగానే ఇచ్చేసారు. గత గడిని పూరించింది ఒక్కరే. వారే ఈసారి గడి కూర్పరులు. మరి ఈసారి కాస్త ప్రత్యేకమైన గడి ఇచ్చారు భైరవభట్ల కామేశ్వరరావుగారు. ముందుగా కొన్ని స్లిప్పులు..

అడ్డం.
2 . ఈజీనే. పది
26. నోటినిండుగా నీరు పట్టి ఏం చేస్తారు?
27. స్తుతించు

నిలువు
28 . మహాభారతం రాసినవారిలో రెండోవాడు.

Saturday, August 28, 2010

ఆగస్టు నెల గడి - 2010

మూడు నెలలు దాటింది కదా పొద్దు గడి చేసి. మర్చిపోయినట్టైంది. అందుకేనేమో కొత్త గడి ఇచ్చి మూడు రోజులైనా నేను చూసుకోలేదు. ఈసారి గడి చదువరి గారు ఇచ్చారు . చూద్దాం ఎంత వీజీగా ఉందో..

1అడ్డం - ప్రతి సంఘర్షణకు చేయి ఇలా బిగిస్తారు. కాకపోతే కాంగ్రేస్ గుర్తులో తెరుచుకుని ఉంటుంది.
16 అడ్డం - తలుపు వేసి ఉంది కాస్త తట్టండి ఇలా.. కాకపోతే రెండుసార్లు అనాలి.
19 అడ్డం - కంద ను రమ్మనండి. కోట చుట్టూ తప్పకుండా కట్టాలి.

1 నిలువు - పితతో ఆటలేంటి??
3 నిలువు - రాత
7 నిలువు - హరిని, రాముడిని కలిపి కేకేయండి. వాళ్లే ఒక్కటిగా వస్తారు.
15 నిలువు - చాచి కొడితే ఏమవుతుంది? పళ్లు ???

Friday, April 23, 2010

ఏప్రిల్ నెల గడి - 2010

మార్చి నెల గడి లో కాస్త తికమక కలిగింది. ఈసారి సత్యసాయి గారు తయారు చేసిన గడి ఎలా ఉందో చూద్దాం..

ఇంతవరకు నాకు వచ్చిన కొన్ని స్లిప్పులు...

 47 ..  అడ్డం  జయభేరి సినిమాలో ఘంటసాల పాట ఒక్కసారి తలుచుకోండి..

 38 ..  నిలువు . బోన్

 31 .. అడ్డం .. పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలంటే నాలుగు రంగాల బలాలు కావాలి మరి

 29 .. నిలువు  ముస్లీములు ఇది చేయనిదే మేకలు, గొర్రెలను కోయరు..

19 ..నిలువు .. ఎందుకీ లేనిపోని అపార్ధాలు (దీనికి మరో పదం..)

36.. అడ్డం  నెట్ లు

Wednesday, March 3, 2010

మార్చి నెల గడి 2010

పొద్దు గడి సులువుగా ఉందని అంటున్నామని గడి కూర్పరులు వాపోతున్నారు. అందుకే ఈసారి ఇద్దరు హేమాహేమీలు కలిసి రసవత్తరమైన గడి తయారు చేసారు. చూడగానే నాకు తెలిసిన రెండు స్లిప్పులు .

3 అడ్డం - LIC
13 నిలువు - మారేడు పత్రి

Friday, January 22, 2010

జనవరి నెల గడి - 2010

గత నెల గడి సులువుగానే ఉండింది. కాని చిన్న తప్పు జరిగింది. ఈ నెల గడి మాత్రం ప్రొఫెసర్ గారు ఇంకా సులువుగా ఇచ్చారు. నాకైతే చాలా వచ్చాయి.కాని కొన్ని అంటే చాలా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక గడి స్లిప్పులు ..

నిలువు..

3 - ఈ మధ్యే బ్లాగ్లోకంలో పులిహార ఘుమఘమలాడించిన బెంగుళూరు బ్లాగరు
6 - ఈయన ఎక్కువగా కాంతలమీదే కధలు రాస్తాడెందుకో మరి.
8 - ఈటివి హీరోని తలుచుకోండి
9 - వీజీనే.. విష్ణు వేసింది కూడా ఇవే మరి.
11 - ఈ మణికోసం వెళ్లి కన్యామణిని సాధించాడు కృష్ణుడు
12 - చంపకుండా దండ కట్టండి.
19 - స్టోరీ విత్ పోయెమ్స్
20 - జబ్బు పడగానే ఈ జ్యూసులు తాగమంటారందరు.
22 - శాంబవి పూర్వజన్మలో మిత్రుడంట.
23 - ప్రియమ్మా కనపట్టంలేదేంటి?
24 - రజనీకాంత్ లేటెస్ట్ సినిమాలో రోబో లా నటించాడంట.
26 - వనాన్ని క మ్మని పిలిస్తే సరి
27 - పనిలో చేరినప్పుడు కాయలతోనైనా కష్టం చేయక తప్పదు.
28 - ఫోన్లో అందరిని అలాగే పలకరిస్తారు, బావ ఐతే మటుకు స్పెషలా?

అడ్డం ..

7 - అడిగితే ఎందుకలా విసుక్కుంటారు?
12 - ఈ సబ్బు ఆరోగ్యానికి చాలా మంచిదంట. వెన్నెలకూడానూ
17 - ట్విన్స్
23 - ఈ మళయాళ భామ ఎన్టీఆర్ కి చిన్నప్పుడే ఒక లాకెట్ ఇచ్చింది.చాలా ఇష్టమైన మణి
25 - మధుమేహం ఉన్నవాళ్లింట్లో ఇదా తప్పక ఉండాల్సిన కాయ. తప్పదు మరి
29 - ఇలా సాయం చేయకపోతే మనకు బియ్యం, గోదుమలు,పప్పులు ఎలా?
30 - అప్పుడెప్పుడో భానుమతి, చలం, జమున చేసిన హిట్ సినిమా.
31 - సగం మునిగాక వెనక్కు తిరిగితే ఇలాగే ఉంటుంది
32 - బొజ్జగణపయ్యే.

Wednesday, January 6, 2010

డిసెంబర్ నెల గడి - 2009

గడి సాధకులు మెల్లిగా పెరుగుతున్నారు. సంతోషం. ఇక ఈ నెల గడి కూర్పరి రానారె.. చూద్దాం ఎలా ఉందో? ముందుగా కొన్ని స్లిప్పులు..

1 అడ్డం -- ఇది మావూరేనండోయ్!
1.నిలువు - ఊర్కె గట్ల పరేషాన్ గాకుండ్రి.
9 అడ్డం - పనేమీ లేదా? ఐతే కొన్ని రాగాలు పాడండి. ఆలాపన నుండైనా పర్లేదు.
13. ఇది ఈజీనే.. మేజర్ చంద్రకాంత్.

Thursday, November 19, 2009

నవంబరు నెల గడి - 2009

హమ్మయ్య..ఏదో కాస్త వీజీగా ఉంది కాబట్టి గత నెల త్రివిక్రమ్ ఇచ్చిన గడి చాలా మంది తప్పులు లేకుండా పూరించారు.
ఈ నెల గడి భైరవభట్ల కామేశ్వర రావుగారు ఇచ్చారు. ఎప్పట్లాగే మెలిక పెట్టి . చూద్దాం ఎలా ఉందొ.. కొన్ని స్లిప్పులు ..


1 నిలువు - ఈ రోజుల్లో అబ్బాయిలకు వంటావార్పూ తప్పక రావాల్సి ఉంది మరి..

3 నిలువు - ఆదివారం క్రిస్టియన్లు చెప్పే మంచివార్తలు.

3 అడ్డం -సురేఖ కారం తినగానే ఖ ఎగిరిపోయిందట. పోతేపోనీ. దానితో టపాసులు చేసుకుందాం

6 అడ్డం -ఈ టీపా య్ ని తన్నకండర్రా? అంచులు విరిగిపోతాయి.

6 నిలువు - చిన్నప్పుడు తప్పనిసరిగా వేసేవారు. ఇప్పుడైతే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.

32 అడ్డం - పుల్లగా ఉన్నా తియ్యగా ఉంటారు మరి ఈ రెడ్డిగారు.

36 అడ్డం - ఆ లక్ష్మణుడిని ప్రేమగా,మాడర్న్ గా పిలవండి.

35 నిలువు - మహావిష్ణువు రెండో అవతారం

37 అడ్డం - ఏంటో ఇవాళ పరాకుగా ఉన్నారు. ఏమైంది?

26 నిలువు - అబ్బ ఇదంటే నాకు చాలా ఇష్టం.దీనికోసం బంగారం కూడా వదులుకుంటాను. ఇదేపేరుతో నవీన్ బ్లాగు ఉంది.

28 నిలువు - తలుపు మీద "టకటక" మని చప్పుడు వినపడింది..ఎవరది?

మిగతా స్లిప్పులు ఎవరైనా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది...

Saturday, October 24, 2009

అక్టోబర్ నెల గడి - 2009

ఈ నెల గడి పొద్దు సంపాదకులు త్రివిక్రం గారు ఇచ్చారు. చూడగానే వచ్చిన వాటికి కొన్ని స్లిప్పులు..


1 అడ్డం..ఈ ఊరిలోచల్లనమ్మబోదురంట
12 అడ్డం.. ఇనుప పెనంపై తడి ఉంటే త్వరగా పట్టుకుంటుంది.
17 అడ్డం.. ఈ బ్లాగరి చాలా రోజులనుండి కనపట్టంలేదు. ఎవరికైనా తెలుసా??
4 నిలువు..ఈ ముద్రలో లోపాలున్నాయి. చూసుకోండి..
9 అడ్డం - చదరంగంలో కదిపేవి.

Wednesday, September 23, 2009

సెప్టెంబర్ నెల గడి - 2009

ఈ నెల గడి ప్రొఫెసర్ గారిదే.. ఇప్పుడే చూడగానే నాకు తట్టిన కొన్ని స్లిప్పులు. మీకు తెలిసినవి చెప్పండి.


౩ నిలువు - నదిని రివర్సులో ఈదండి ..

5 నిలువు - వరూధినిగారి బ్లాగును గుర్తు చేసుకోండి


మరికొన్ని సులువుగానే తెలిసిపోతాయి. ప్రయత్నిస్తూ ఉండండి.మళ్ళీ వస్తాను..

Monday, August 24, 2009

ఆగస్టు నెల గడి - 2009

హమ్మయ్యా!!! ఈ నెల గడి కాస్త సులువుగానే ఉంది . కూర్పరి ప్రొఫెసర్ గారు దయతలిచినారు.

ముందుగా కొన్ని స్లిప్పులు..

1 అడ్డం - బండి మీద కాని, బండార్ లోకాని తప్పనిసరిగా ఉండే ఆలూ ఐటం ఇది
1. నిలువు - అందరికి తెలిసిన రేలంగి మావగారే.. ఆ ఏడుకొండలవాడిని తలుచుకోండి.
7 అడ్డం - గంప
24 అడ్డం - రిమ్ జిమ్ హైదరబాద్
4 నిలువు - ఈ నాలుగు విషయాలలో తోడుంటానని పెళ్లిలో ప్రమాణాలు చేయిస్తారు.
8. అడ్డం - పూరి చేసినప్పుడు ఇది కూడా తప్పకుండా చేయాల్సిందే మరి..
18 నిలువు - ఇవి ప్రతివంటింట్లో ఉండే వస్తువులే కిందా మీదా అయ్యాయి అంతే.
21 అడ్డం - చంద్రబాబు మీద దాడి జరిగింది ఇక్కడే కదా
37 అడ్డం - బాలాజి నుదుటి మీద ఉండేవి అవేగా.
42 అడ్డం - ఫేమస్ పిజ్జా ..ఇది ఈజీనే.. పిజ్జాలు తినడం అలవాటు లేకుంటే గూగులమ్మని అడగండి.

Monday, July 27, 2009

జులై నెల గడి - 2009

వాన కోసం ఎదురుచూసినట్టుగా గడి ఫలితాలు, కొత్త గడి కోసం ఎదురు చూడక తప్పడంలేదు. అయినా పేపర్లు దిద్దడానికి ఇన్నిరోజులా.

ఈసారి కామేశ్వరరావుగారు గడిని తయారు చేసారు. కాస్త తికమకగా ఉంది అనిపించింది. ఇంతకు ముందులాగే కీలకపదం ఉంది. గడి చూడగానే తెలిసిన కొన్ని పదాలకు స్లిప్పులు ఇదిగో.. మిగతావి రేపు చూస్తాను. ఇంకా ఎవరికైనా స్లిప్పులు దొరికితే .. తట్టితే ఇలా ఇచ్చేయండి..


33 నిలువు - చొక్కాలకు గుండీలు పెట్టకుండా వదిలేయడం కూడా ఫ్యాషనే..
36 నిలువు - సన్మానం చేసేటప్పుడు పూలదండతో పాటు తప్పక ఉండేది.
39 నిలువు - ఇంకా మాటలు రాని పసిపిల్లలు ఇలా ఏడుస్తారు. అదే వారి బాష మరి.
41 అడ్డం - ఒక్కసారి స్కూలు పాఠాలు గుర్తుకు తెచ్చుకోండి. ఆధారంలోని పదాన్నే అటుదిటు చేయండి..

Wednesday, June 24, 2009

జూన్ నెల గడి - 2009

ఈనెల గడి కాస్త ఆలస్యంగా వచ్చింది. రానారె సంధించిన గడి ఎలా చూద్దాం.. చూడగానే నాకు తెలిసిన సమాధానాలు..

1. అడ్డం - ఈ పిల్లికి ఎపుడు ఇదే తిప్పలు.
1. నిలువు - బావ మరదలిని ఇలాగే పిలుస్తాడేమో.
2. నిలువు - ఆడపిల్లలు చెమ్మ చెక్కలాడడమే మర్చిపోయారు..
19. అడ్డం - దీపావళి పండగ తిథి గుర్తు చేసుకోండి.


మళ్ళీ వస్తాను.. మీకు తెలిసిన స్లిప్పులిచ్చుకోండి..

Saturday, May 16, 2009

మే నెల గడి - 2009

ఈ నెల గడి ప్రొఫెసర్ సత్యసాయి గారు తయారు చేసారు. ఇప్పటికైతే కొన్ని స్లిప్పులు ఇచ్చేస్తున్నా. మళ్ళీ వచ్చి మిగతా వాటిసంగతి చూస్తాను..

42 నిలువు - ఈ సినిమాలో చిరంజీవి మొదటిసారిగా పాట పాడి ప్రేమ పాఠాలు చెప్పారు విద్యార్థులకు.
19 నిలువు- పిల్లలు దేవుడు చల్లనివారే ... ఈ పాట ఎక్కడ విన్నారో గుర్తు తెచ్చుకోండి..
18 అడ్డం - జులాబి అని వేణుమాధవ్ అంటాడు అదేనా...

Saturday, April 18, 2009

ఏప్రిల్ నెల గడి - 2009

ఈనెల గడి భైరవభట్ల కామేశ్వరరావుగారు ఇచ్చారు. ఈసారి కాస్త వెరయిటీగా ఉంది.. వేసవి సెలవులు కదా బుర్రకు కాస్త ఎక్కువ పదును పెట్టాలి మరి...
ముందుగా కొన్ని స్లిప్పులు ...

18. నిలువు . రాజులు ఉండే భవనం ...
18. అడ్డం. వేసవిలో తప్పని వాత...
29. అడ్డం. పిల్లలు ఆడుకునేవి...

Wednesday, March 11, 2009

మార్చి నెల గడి - 2009

గత నెల పొద్దు గడి స్లిప్పుల సర్వీసు వల్ల సందడి బానే ఉండింది కాని అందరూ పంపించనట్టుందే. ఎందుకలా??? తప్పైనా, ఒప్పైనా పంపండి. ఒకవేళ డౌట్ ఉంటే చివరి తేది కంటే ముందు మళ్ళీ పంపించొచ్చు . ఏమి కాదు.

ఇక ఈసారి గడి మన వీరబల్లె వీరుడు రానారె తయారు చేసింది. చూద్దాం. ఇది ఎలా ఉందో..

ముందుగా కొన్ని స్లిప్పులు..

10 . నిలువు. రాముడు భీముడు సినిమాలో మాధవ పెద్ది పాడిన ఫేమస్ పాట. ఒక్కసారి రేలంగిని గుర్తుతెచ్చుకోండి.
27. అడ్డం . ఈజీనే. తెలీదంటే వేమన గారు తిడతారు.
32. నిలువు . కొంతమంది పెద్దమనుష్యుల తీరు చూస్తే వాళ్ళ మెదడు ఇక్కడుంది అనిపించక మానదు.
17. అడ్డం . ఈ బిందెలు పెళ్ళిళ్ళలో కామనే. లాగించండి.
17. నిలువు. పాపం కృష్ణుడు ఈ పని చేసి, నారదుడికి సేవకుడు కావలసి వచ్చింది.

Monday, February 9, 2009

ఫిబ్రవరీ నెల గడి - 2009

పొద్దు గడి కోసం మాత్రమె ఈ బ్లాగు మొదలెట్టాను.
ఈ నెల గడి ప్రొఫెసర్ గారు ఇచ్చారు. నాకైతే కాస్త సులువుగానే అనిపించింది చూడగానే. ముందుగా కొన్ని స్లిప్పులు.....


25 నిలువు .. విశ్వనాధ్ సినిమా రాధిక పాడిన జోల..
29 అడ్డం .. పైది వస్తే ఇదీ వచ్చినట్టే.
31 అడ్డం ... ఆశా పారేక్ అభినయించిన ఫేమస్ పాట.
30 నిలువు.. మొదటి రెండు పదాలు వెంకటేష్ ,సౌందర్య నటించిన హిట్ సినిమా..
21 అడ్డం.. ఈ నటి రిక్షావోడి తల్లి..
10 అడ్డం.. మన పి.ఎస్.ఎమ్ లక్ష్మిగారు తరచూ రాసేది అదేగా..