మార్చి నెల గడి లో కాస్త తికమక కలిగింది. ఈసారి సత్యసాయి గారు తయారు చేసిన గడి ఎలా ఉందో చూద్దాం..
ఇంతవరకు నాకు వచ్చిన కొన్ని స్లిప్పులు...
47 .. అడ్డం జయభేరి సినిమాలో ఘంటసాల పాట ఒక్కసారి తలుచుకోండి..
38 .. నిలువు . బోన్
31 .. అడ్డం .. పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలంటే నాలుగు రంగాల బలాలు కావాలి మరి
29 .. నిలువు ముస్లీములు ఇది చేయనిదే మేకలు, గొర్రెలను కోయరు..
19 ..నిలువు .. ఎందుకీ లేనిపోని అపార్ధాలు (దీనికి మరో పదం..)
36.. అడ్డం నెట్ లు
Friday, April 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
26 comments:
11 అడ్డం ఓహో...దోహో నా....
అడ్డం: 8.సుగ్రీవుడి భార్య ఉప్పుబట్టీ పెట్టుకుంది:-)
11. బీకరులో దాగున్న హిందీ కవి.
14. ఆ అరుగు మీద నందిలా కూర్చున్న తిమ్మయ్య ను చూసి వాణిశ్రీ చిద్విలాసముగా నవ్వదా?
16. లేచిగురు లేచిపోయింది.
23. సమరం అంగ(స్తంభ)న కాదు కాస్త సరిచేయండి.
34. పాలబుగ్గల పసిడిది షికారు కెళ్లడానికిది కావాలి సూమా.
35. స్కోరు లేనిఒ?
నిలువు:1.ఈ స్కీములకు రాజర్షి ఎన్‌టీరామారావు పేటెంటు హక్కులు కలిగి ఉన్నాడు.
2.మామ మొదట్లోనే చిన్నబోయాడు.
7.సాహితిని పిలవండి.
11.కత్తి వినయ్ పొట్టిగా.
12.తిరగబడ్డ సురద్వయం.
17.ఈ రామ్ మీవాడు కాదు.
18.బొబ్బిలి ఫేం.
24.స్కా ద్వయంతో 'చమ'క్కు.
32.అనుష్కను గుర్తుకుతెచ్చే తురకలు.
33.తివారి పుణ్యమా అని ఇలా పజిళ్లలో నలిగిపోతున్నాడు.
5,21, 27 నిలువు
9, 13, 26, 30,42, 45 అడ్డం మరో క్లూ ఇవ్వండి ఎవరైనా...
1 అడ్డం: వశిష్ట ..... ది వందిత అని కొన్ని నృత్యగీతాల్లోనూ వినిఉంటారు
ఇప్పటివరకు ఇచ్చిన స్లిప్పులన్నీ వచ్చాయి.మిగిలిన స్లిప్పులు పుణ్యాత్ములు తొరగా ఇచ్చుకోండి...:))
అడ్డం 39. 24ఫ్రేములు64కళలు ఉన్న ఒక సైటు బహువచనంలో.
26. కలప వనములో దొరకదా మీక్కావలసింది.
42. ముదిత రుమ చివర వదిలేసి సరిచేసి చూడండి.
నిలువు 27. కప్పము మధ్యలో మార్చండి.
నిలువు 6. నిలువు 33కు సంబంధించిన వాడే.
అడ్డం 10. నవమాత్రుకల్లో ఒకరు. వరాహమునకు అటు దీర్ఘము ఇటు గుడి యిస్తే సరి.
అడ్డం 15. ఇంగ్లీషు అడ్డవరుస.
10అడ్డం. సారీ.నవమాత్రుకలు కారు. సప్త మాతృకలు.
అడ్డం...
4, 9. 20. 30 . 45 , 42 (మురళిగారు ఇచ్చిన స్లిప్పు అర్ధం కాలేదు)
నిలువు... 4
ఈ స్లిప్పులు కావాలి...
నాక్కూడా ఇవే కావాలి. 1, 5 నిలువు కూడా
42 గురించి మరి కొంత క్లూ
ముదిత, రుమ క్రమం మారి కలగలిసిపోతే విదితమౌతుంది.
అడ్డం 30:"Funny Story" ని (సగం)తెనిగించి తిరగేయండి సరిపోతుంది
4.అడ్డం: దరిద్రదేవతను పెద్దమ్మతో పోలుస్తారు కదా? మరి 'నవధతి'ని సరిచేస్తే లక్ష్మీపుత్రిక అగుపించదా?
4.నిలువు: ధమనికలో 'మ' మాయం చేస్తే యువతి అనే అర్థం వస్తుంది. అయితే ఆమె అందగత్తె అవునోకాదో మీరే తేల్చుకోండి :)
అడ్డం 9 : తెలుగులో go, stop అనండి
నిలువు 1 : వారు వాణి పని కాలు ధహి ఈ పదాలు ఒకటి గాకలిపి సరిచేయండి.
5 : నలుగురు లో ఒకరు మారారు
అడ్డం 13: జమిందారీ వ్యవస్థలో ఉండే రైత్వారి వ్యవస్థ
అడ్డం:18, 20, 45, నిలువు:25 స్లిప్పులు కావాలి !
అడ్డం 18
మీరు ఉంగరం చేయమని బంగారమిస్తే దాట్లోంచి వీసమెత్తు తరుగు పోఇందా? ఐనా ఈరోజుల్లో గ్రాములే కానీ వీసాలు ఎక్కడౌన్నయండి?
నా బండి కూడ అడ్డం 20,45 ,నిలువు 45 లలో అటకాయంచింది
21 నిలువు సంగతి తేల్చండి.
20,45 ,నిలువు 45 ఇవి కూడా ఇంకా తేలలేదండి. ఈ ఎండలకు ఆలోచించే ఓపిక లేక ఈసారి గడి వదిలేద్దామనుకున్నా..
జ్యోతిగారు, అపరంజిగారు కూడా నిలువు 45 స్లిప్పుకావాలంటారు! నిలువు 44 వరకేగదా ఉన్నాయ్.
అవునండి. అది నిలువు 44
అమ్మయ్య మళ్ళి తెరపైకి వచ్హారా ఎవెరూ కనపడక పోతే అందరూ గడి పంపేసారేమో అనుకుని వూరుకున్నను.
క్షమించండి అవును నిలువు 44 వరకే వున్నాయ్
నాకు నిలువు 21, 25
నాకు అడ్డం 45 రావటం లేదు.
అడ్డం 20 కూడా సందెహంగానే వుంది
ధర్మం ప్లీసె
నిలువు 44 : తడిసి ఆద్యంతాలు,
మిగిలినవి ఎవరైనా పుణ్యంకట్టుకోవాలి.
2010 ఏప్రిల్ నెల గడి సమాధానాలకు మోక్షం ఎప్పుడు?
ఏమో మరి? గడి సమాధానాలు లేవు, కొత్త గడి కూడా ఇంకా ఇవ్వలేదు. పొద్దు సంపాదకులు నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకో మరి??
ఏప్రియల్ నెల గడిలో సాంకేతిక లోపాలు అనేకం ఉన్నాయి. అవన్నీసోదాహరణంగా -సమాధానాలు పంపించేముందే నిర్వాహకులకు నివేదించడం జరిగింది. బహుశావారు ఆవిషయమై ఎటూనిర్ణయించలేక సంధిగ్ధంలో ఉండియుండవచ్చు!
Post a Comment