Friday, January 22, 2010

జనవరి నెల గడి - 2010

గత నెల గడి సులువుగానే ఉండింది. కాని చిన్న తప్పు జరిగింది. ఈ నెల గడి మాత్రం ప్రొఫెసర్ గారు ఇంకా సులువుగా ఇచ్చారు. నాకైతే చాలా వచ్చాయి.కాని కొన్ని అంటే చాలా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక గడి స్లిప్పులు ..

నిలువు..

3 - ఈ మధ్యే బ్లాగ్లోకంలో పులిహార ఘుమఘమలాడించిన బెంగుళూరు బ్లాగరు
6 - ఈయన ఎక్కువగా కాంతలమీదే కధలు రాస్తాడెందుకో మరి.
8 - ఈటివి హీరోని తలుచుకోండి
9 - వీజీనే.. విష్ణు వేసింది కూడా ఇవే మరి.
11 - ఈ మణికోసం వెళ్లి కన్యామణిని సాధించాడు కృష్ణుడు
12 - చంపకుండా దండ కట్టండి.
19 - స్టోరీ విత్ పోయెమ్స్
20 - జబ్బు పడగానే ఈ జ్యూసులు తాగమంటారందరు.
22 - శాంబవి పూర్వజన్మలో మిత్రుడంట.
23 - ప్రియమ్మా కనపట్టంలేదేంటి?
24 - రజనీకాంత్ లేటెస్ట్ సినిమాలో రోబో లా నటించాడంట.
26 - వనాన్ని క మ్మని పిలిస్తే సరి
27 - పనిలో చేరినప్పుడు కాయలతోనైనా కష్టం చేయక తప్పదు.
28 - ఫోన్లో అందరిని అలాగే పలకరిస్తారు, బావ ఐతే మటుకు స్పెషలా?

అడ్డం ..

7 - అడిగితే ఎందుకలా విసుక్కుంటారు?
12 - ఈ సబ్బు ఆరోగ్యానికి చాలా మంచిదంట. వెన్నెలకూడానూ
17 - ట్విన్స్
23 - ఈ మళయాళ భామ ఎన్టీఆర్ కి చిన్నప్పుడే ఒక లాకెట్ ఇచ్చింది.చాలా ఇష్టమైన మణి
25 - మధుమేహం ఉన్నవాళ్లింట్లో ఇదా తప్పక ఉండాల్సిన కాయ. తప్పదు మరి
29 - ఇలా సాయం చేయకపోతే మనకు బియ్యం, గోదుమలు,పప్పులు ఎలా?
30 - అప్పుడెప్పుడో భానుమతి, చలం, జమున చేసిన హిట్ సినిమా.
31 - సగం మునిగాక వెనక్కు తిరిగితే ఇలాగే ఉంటుంది
32 - బొజ్జగణపయ్యే.

16 comments:

mmkodihalli said...

నిలువు -
8. పజిల్ లాంటిది. నెంబర్ల గేము. ఈ మధ్య ప్రతి న్యూస్‌పేపర్లోనూ కనిపిస్తుంది.
9. కమల్ : దశావతారం :: అక్కినేని : _____ (బహు వచనంలో)
19. ఈ భాను టీవీ యాంకరు.
అడ్డం -
1. ఇది వస్తుందంటే జన విజ్ఞాన వేదిక వారికి పండగే పండగ.
9. భూనభోంతరాళాలలో భూమీ, అంతరాళమూ మిస్సింగ్.
18. ఊటీ ని ఈ మండలం అంటాం
19. పలు ద్వయం.
21. మదము అంటే గర్వము. _ _ _ అంటే అణచేది.

జ్యోతి said...

మురళీమోహన్ గారు,
21 అడ్డం అర్ధం కాలేదండి.
నాకు ఈ స్లిప్పులు కావాలి.
1 నిలువు (సందేహంగా ఉంది. నేను రైటేనా అని)
4 అడ్డం
10 నిలువు

mmkodihalli said...

అడ్డం 21. మదనినిదదప ఈ స్వరములయందు పని లేదు కనుక నిషాదము చివరకు వెళ్ళింది.
అడ్డము 4.ఈ పురుగు అటునించి కాండమును తొలుచుచున్నది.
నిలువు 1.ఈ ఈగలు ఇంగ్లీషువా?

Unknown said...

జ్యోతి గారు , మురళీ మోహన్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన ఆధారాలతో కొంచెం కష్టపడి పూర్తి చేయగలిగాననే అనుకుంటున్నా.

కానీ 9 అడ్డం ,10 ,1, 5 నిలువులు రాలేదు. కొంచెం ఎవరికైనా తెలిస్తే క్లూస్ ఇవ్వరా !

aparanji said...

9 అడ్డముగా ఉన్న భవనము లొ న తీసేసి, సవరంచి ప్రయత్నిచి చూడండి

పది నిలువు, ముక్తి,ముక్తముల మొదళ్ళను అక్షువులతొ కలిపి చూడండి

aparanji said...

ఒకటి నిలువు నాకు కూడా కించిత్తు సంధేహంగానే ఉంది ఐనా నానుకున్న పదం 'నాకు వచ్హిన అవకాసాన్ని --- ఇలా తన్నుకు పోయరూ అంటారుగా

జ్యోతి said...

శ్రీలు,

9 అడ్డం - అభయము నుండి ఒక అక్షరం తీసేస్తే సరి
1 నిలువు - ఈగిల్
5 నిలువు - అక్కడ ఇంగ్లీషులో చూడమంటే నాకు హిందీలో ఆగమన్నట్టు వస్తుంది. నాకు ఈ పదానికి స్లిప్పు కావాలి..

శ్రీలలిత said...

జ్యోతీగారూ, నాకు
4,అడ్డం
5, నిలువు
13, అడ్డం, నిలువు
15. అడ్డం
తెలియటం లేదు. కొంచెం చెప్పగలరా..

aparanji said...

13 అడ్డం, ఒక ఆవర్తమును తీసికొని ఎడా పెడా విసిరేసి రాయండి, అప్పుడు 13 నిలువు లో భరించేవాడు కిందనించి తప్పక వస్తాడు


15 అడ్డం, గా భరా లో గా మింగేసారా?

aparanji said...

5 నిలువు, -- లు కలిసిన శుభ వేళా ,ఏటొచ్హి తిరగబడింది

జ్యోతి said...

అపరంజిగారు, 5 నిలువు మీరు చెప్పినదైతే మరి 4 అడ్డం ఏంటి?? 15 అడ్డం స్లిప్పు మళ్లీ ఒకసారి చూస్తారా? మీరు చెప్పింది 9 నిలువుతో కలవడంలేదు.

లలితగారు, మీరు మిగతావాటికి అపరంజిగారు చెప్పినట్టు ఫాలో ఐపోండి.

స్లిప్పులు త్వరగా కావాలి. ఒక్కరోజే టైమ్ ఉంది..

శ్రీలలిత said...

జ్యోతీగారూ,
థాంక్స్.. అపరంజిగారిని ఫాలో అయిపోయా. కాని
నాకింకా అడ్డం 4.15 రాలేదు.. ఎవరైనా చెప్పగలరా..

aparanji said...

9 నిలువు, ఈ సారి దసరా రాత్రులు, 9 అడ్డం, భూ నభోంత్రాళాలు ఏకం అయ్యలా చేయండి
అప్పుడు
13 నిలువు లో భరించే వాడు కిందనించి దూసుకు వస్తాడు

ఇప్పుదు
15 అడ్డం, ముందుగానే అనుకున్న గాభరా లో గా మింగండి

aparanji said...

జ్యోతి గారు ధన్యవాదాలు మీరు చెప్పాక నేను సరి చూస్తే
4 అడ్డంఇలా అనిపించింది
కాండము కు ఎక్కాడా కుళ్ళు కాయలు చూడలేదు
4 అడ్డం అలాకాక మీరు మరోపదం పూరించితే దానికి క్లూ ఇవ్వరా ప్లీస్
అప్పుడు ఈ దిద్దుబాటుతో
5 నిలువు, ఇంగీషు లో తలకిందులుగా చూసి ప్రయత్నించండి ఈ హడవిది లో క్ కాక కు ఐందే?

Unknown said...

అపరంజి గారు ,జ్యోతి గారు చాలా థాంక్స్ అండి క్లూలు ఇచ్చినందుకు !

4 అడ్డం అటు నుండి కాండం తో మొదలయ్యె పురుగు (పంట చేలల్లో ఉంటుంది అనుకుంట )5 నిలువు వచ్చి ఇంగ్లీషులో చూడండి. అని నేను అనుకుంటున్నాను

జ్యోతి said...

హమ్మయ్యా!! ఇప్పుడు నా గడి పూర్తయింది. అపరంజిగారు మీరు చెప్పిందే రైటు. పైన మురళిమోహన్ గారు చెప్పిన క్లూ కాస్త జాగ్రత్తిగా చదివితే పదం వచ్చేసింది.

Post a Comment