మూడు నెలలు దాటింది కదా పొద్దు గడి చేసి. మర్చిపోయినట్టైంది. అందుకేనేమో కొత్త గడి ఇచ్చి మూడు రోజులైనా నేను చూసుకోలేదు. ఈసారి గడి చదువరి గారు ఇచ్చారు . చూద్దాం ఎంత వీజీగా ఉందో..
1అడ్డం - ప్రతి సంఘర్షణకు చేయి ఇలా బిగిస్తారు. కాకపోతే కాంగ్రేస్ గుర్తులో తెరుచుకుని ఉంటుంది.
16 అడ్డం - తలుపు వేసి ఉంది కాస్త తట్టండి ఇలా.. కాకపోతే రెండుసార్లు అనాలి.
19 అడ్డం - కంద ను రమ్మనండి. కోట చుట్టూ తప్పకుండా కట్టాలి.
1 నిలువు - పితతో ఆటలేంటి??
3 నిలువు - రాత
7 నిలువు - హరిని, రాముడిని కలిపి కేకేయండి. వాళ్లే ఒక్కటిగా వస్తారు.
15 నిలువు - చాచి కొడితే ఏమవుతుంది? పళ్లు ???
Saturday, August 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
23 comments:
నాకు ఈ క్రిందివాటికి స్లిప్పులు కావాలి.
అడ్డం: 4,6,9,10,12,27
నిలువు: 4,5,11,21,27
కొన్ని స్లిప్పులు
అడ్డం: 8.మురిపించుము ను ముంచుము.
13.కనుట అంటే చూచుట అని అర్థం.
18. తోక అంటే ఏమిటో తెలుసుకోవాల మరి!
20. వర్షం కురియాలిగదా!
23. నాన్న తేలికగా బెట్టు చేస్తే నాన్చడమౌతుందా?
24.ఏముందీ గౌరవమునకు వికృతి తిరగరాయండి.
28. హిందీ ఆటగాడే. మనం మోసగాడికి ఈ విశేషణం వాడతాం.
30. కొందరమ్మాయిలకు ఇవి రెండుంటాయి. అవేనా? అపార్థం చేసుకోకండి.
31. యల'మంద' పనీ పాట లేకుండా 'గాలి'కి తిరిగేవాడు కాదు :)
32. విభాగములో మొదటి సగం చదువరిలో రెండో సగం. వెరసి రాత్రి కాదా మరి.
35. రుచి మధ్యలో ప్రథమా విభక్తిలో ఒకటి.
36.దారిలేదు:)
37.పసిడి జింక తెలుసు కానీ ఈ కేకి ఎక్కడుంది?
40.చూస్తేనేం. జ్ఞానోదయం అయింది కదా?
43.కలికాలంలో ప్రజలు గులాములుగా ఉన్నంతవరకూ అలాంటి క్రూర పాలకులు ఉంటారు.
45.భవము కాదు, వనము కాదు ఆకాశము.
46.దంపతుల మధ్య ఇది ఆశిస్తాము.
47.కొందరి చేష్టలు ఇలా ఉంటాయి.
మరికొన్ని తరువాత.
నిలువు:14.కొన్ని చిన్న చిన్న తగాదాలు ఇలా మారుతుంటాయి. కిందనుండి చదవండి.
15.కుక్క అన్నాక మొరగక తప్పుతుందా? వాన అన్నాక ____ తప్పుతుందా?
20.వర్షాన్ని తిప్పేసి దీర్ఘాలు మారిస్తే పడవ వస్తుంది కదా?
22.కైవారపు కైపు లేదు.
23. విన్నావా? విన్లేక పోతే పడవా?
25. బొగ్గు అవశేషము.
26. ఏడ్పుగొట్టుది అదేనండి నీటితో నిండిన కన్నులు కలది.
27. లీల చేసే వినోదమా?
33. ఈ వినోబా భూదానోద్యమ నాయకుడు.
35.రాజీవ్ ప్రతాప్ సింగేనా? రూఢి చేసుకున్నారా?
36. కల్లాపి మధ్యలో పలచగా చల్లారేం?
38. శ్రీశ్రీ పూరించమన్నది ఈ శంఖమేనా?
మురళిగారు, నాకు ఈ స్లిప్పులు అర్ధం కాలేదండి.
అడ్డం...
30. కొందరమ్మాయిలకు ఇవి రెండుంటాయి. అవేనా? అపార్థం చేసుకోకండి.
నిలువు...
23. విన్నావా? విన్లేక పోతే పడవా?
ఇక మీరు అడిగిన స్లిప్పులు నాకు కూడా కావాలి
25 నిలువు- జోగీ జోగీ రాసుకునిన....
మురళిగారి స్లిప్పులకు వివరణ:
అడ్డం 30: అమ్మాయిలకు ఇవి రెండుంటే ఇంకా పెళ్ళికాలేదని, ఒకటుంటే పెళ్ళయిందని - ఇదివరలో ఓ కొండగుర్తు!
నిలువు 23: 'విన్నావా' లో 'విన్' కత్తిరించండి.
హలో ఆల్ :)
ఈ సారి గడిలో తెలుగులో టైపాలంటే రావటం లేదు నాకేనా ఇది అందరికీనా?
అందరూఅదేనావలో ఉన్నాము
శ్రీలు,
పొద్దు రూపు మార్చి మనకు తిప్పలు పెట్టారు..:(
నాకు ఈ స్లిప్పులు కావాలి .. ఒకటోసారి.. రెండోసారి.. (ఐపోయింది) మూడోసారి.
అడ్డం: 4,6,9,10,12,27
నిలువు: 4,5,11,21,27
అమ్మయ్యా పొద్దు పొడిచింది ఈ నవోదయం చాలా బాగుంది గడి దగ్గరె చిక్కు వస్తొంది. తెలుగు లో వ్రాయటం రావటం లేదు. మరికోదరు కూడా ఆ నావలోనే ఉన్నారన్నారు. మరేమిటి దారి? మార్గదర్సకులకు శతసహస్ర వందనాలు.
గడి సాధకులందరికీ నమస్కారం. కొత్త రూపు లోని గడి మీద మీ అందరి అభిప్రాయాలు, సూచనలు గ్రహించి మార్పు చేర్పులు చేస్తున్నాం. ముందుగా రెండు రోజుల్లో, తెలుగులోనే రాసే సౌకర్యం ఇస్తున్నాం. ఓర్పు వహించవలసినదిగా కోరుతున్నాం. ఈలోగానే పరిష్కారాన్ని పంపదలిస్తే, ఇంగ్లీషులోనే టైపించి పంపండి.
ఏం వానలో.. కురవకపోతే ఎలానో అని అనుకుంటాం. కురిస్తే ఇలానా అని అనుకుంటాం :)
-పొద్దు పనుపున
చదువరిగారు, గడిలో నాదొక చిన్న సలహా.. ప్రతి గడి దగ్గర కర్సర్ పెట్టగానే ఆధారం కూడా కనపడేది. ఆ వీలు చేయండి.ప్రతిసారి ఆధారం కోసం పేజిని క్రిందకు, పైకి తిప్పడం విసుగ్గా ఉంది. ఇంతకుముందైతే సులువుగా ఉండేది..
జ్యోతి: అవునండి, అది చాలా ఉపయోగపడుతుంది. త్వరలోనే అది కూడా అందుబాటులోకి తెస్తాము.
అడ్డం:
9 : మీకు గృహఋణం కావాలంటే మీస్థలం తాలూకు "దీని" నకలు కావలసిందే, కాకపోతే ఇక్కడ కకావికలైంది.
నిలువు:
5 : పక్షి ని తిప్పి లంఖిణి తోక తగిలిస్తే మీక్కావలసింది దొరుకుతుంది.
21: కులుకు మధ్య ప్రధమావిభక్తిలోమరోటి చేరింది.
27: లీల, వినోదు లు చెట్టపట్టాలేసుకుంటే ఇలా అనవచ్చా
పది రొజులైంది/ ఇంకా పదిరోజులే ఉంది - మిగితా స్లిప్పులెవరూ పుణ్యంకట్టుకోరే !
పారాహుషార్! గడువు తేదీ దగ్గర పడుతోంది. పూరకులు త్వరపడవల్సినదిగా కోరుతున్నాం.
ఒకసారి మా బ్లాగు (http://blog.poddu.net/?p=7) చూడండి.
వార్షికోత్సవ శుభాకాంక్షలు .
నాకు ఈ స్లిప్పులు ఇవ్వగలరా??
అడ్డం..
6, 27
నిలువు 27 లో చెట్టపట్టాలేసుకుంది "లీలా వినోదులు" కాకుండ, రమా వినోదులనుకుంటే ? 30 అడ్డం కి ఇబ్బందేమీవుండదు - అప్పుడు 27 అడ్డం "చేతిలోతోక" సరిపోయేలావుంది ప్రయత్నించండి.
అడ్డం 6 - అయోమయంగావుంది
మిగిలిన గడిమొత్తం పూర్తెనట్లేనా!
అన్వేషిగారు, కరెక్ట్ అని నమ్మకంలేకున్నా ఒక సెట్ పంపించి ఈ రెండు సందేహాలతోనే. మీరు చెప్పినట్టు రమావినోదులను కలిపి మరో సెట్టు పంపితే సరి. మీకు కావలసినవి ఏవి. తప్పైతే నన్ను అనొద్దు మరి...
జ్యోతిగారు - నెనర్లు, ఈసారికి పంపించే ప్రయత్నం విరమించి మిన్నకున్నాను, కావలసినవి చాలానేవునాయిలెండి!
అన్వేషిగారు, మీరు చెప్పిందే రైటండి. నేను పంపిన గడి అంతా తప్పుల తడక అని తెలుసు. అనుకున్నట్టే జరిగింది. ఈసారి ఇలా ఎందుకు జరిగిందంటారు. స్లిప్పులు అందకా? పొద్దు గడిలో చాలా గ్యాప్ వచ్చినందువల్లా.. సులువుగా అనిపించానా అన్ని తప్పులా?? అయ్ బాబోయ్..
జ్యోతిగారు! మనం గడి ఆధారాల కంటే స్లిప్పులు, వాటి వివరణలపైన దృష్టి ఎక్కువ పెట్టడవల్ల దారితప్పామనిపిస్తుంది. ఈసారి తప్పులోకాళ్ళేయకుండా - పూరణ సాధిస్తారని ఆశిస్తున్నా!
నిజమండి. అదీకాక పొద్దుగడి చాలా రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల మనకు కూడా అలవాటు తప్పనట్టైంది. ఈసారి జాగ్రత్తగా ఉందాం..
Post a Comment