గడి సాధకులు మెల్లిగా పెరుగుతున్నారు. సంతోషం. ఇక ఈ నెల గడి కూర్పరి రానారె.. చూద్దాం ఎలా ఉందో? ముందుగా కొన్ని స్లిప్పులు..
1 అడ్డం -- ఇది మావూరేనండోయ్!
1.నిలువు - ఊర్కె గట్ల పరేషాన్ గాకుండ్రి.
9 అడ్డం - పనేమీ లేదా? ఐతే కొన్ని రాగాలు పాడండి. ఆలాపన నుండైనా పర్లేదు.
13. ఇది ఈజీనే.. మేజర్ చంద్రకాంత్.
Wednesday, January 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
అడ్డం : 1.రిక్షావాలాలు రిమ్జిమ్రిమ్జిమ్ అంటూ ఇక్కడే పాడుకొంటారా?
2. ఎన్టీవోడు మెచ్చినా సావిత్రమ్మకు నచ్చలేదీ పాట.
40. ఏటి పడవ సరంగు పాట గిరికీలలో చెలికాడ మన వగల్ కలబోసుకుందాము రావోయి ___ ___!
నిలువు: 1. ఎందుకు నానా ___ పడతారు. ఈజీగా ఉందిగా!
2. కుడియెడమల __ అని రెండుసార్లన్నాడు శ్రీశ్రీ.
3. పాఠకులారా! నా అభిమాన క్రికెటర్ బ్రియాన్ ___!
4. వైశ్యుడు : కోమటోడు:: బ్రాహ్మణుడు : _____
8. ఇదేదో శంకరశాస్త్రిగారిని అడగాల్సిందే!
అడ్డం 2 కాదు అడ్డం 12
మురళీమోహన్ గారు,
40 అడ్డం అర్ధం కాలేదండి. సినిమా పేరు గుర్తురావట్లేదు..మరో క్లూ?
18 నిలువు
41 అడ్డం
31 నిలువు
ఈ నాలుగు వచ్చేస్తే నా గడి పూర్తయిపోతుంది. ఎవరైనా మహానుభావులు వీటికి స్లిప్పులు ఇచ్చకోంఢి..
40 అడ్డం - బంగారంలాంటి మామను రమ్మని పిలువు.
18 నిలువు - ఇంటర్ నెట్ తెలుగు పదం. మధ్యలో 'బా' అని ఏడిస్తే సరి.
31 నిలువు - వారి సంరంభం సరి. సరి సంఖ్యలే చూడు.
40.అడ్డం ఈపాట సినిమా పాట కాదండి. ప్రైవేట్ సాంగ్. చాలా ఫేమస్. ఇంకా క్లూ కావాలంటే ఈ లింక్లో వెదకండి.
http://www.ghantasala.info/allsongs/index.html
శంకరయ్యగారు, మురళీమోహన్ గారు ధన్యవాదాలు. ఆ పాట వెతికి పట్టుకున్నాను. ఒక్కటి మిగిలిపోయింది.
41 అడ్డం.. నాకు వచ్చిన పదం సరియైనదో కాదో అని డౌట్ గా ఉంది..
జ్యోతి గారూ,
41 అడ్డం నాకూ రాలేదు. 19 నిలువు, 26 అడ్డం ఆధారాలు కావాలి.
19 ... నిలువు చాలా అంటే చాలా పేదవాడు
26 అడ్డం.. హృదయమేనండి.ఆధారంలోనే సమాధానముంది.
7 aDDam, 23 aDDam tappa anni aipoyaayi.
veetiki alternative clues ivvagalaraa??
సౌమ్య
7 అడ్డం - యుద్దంలో ఫైటింగ్ చేసే స్త్రీని ఏమంటారు?
23 అడ్డం - ఒక చెట్టు చుట్టూ కడతాము కదా. అధే. ఆధారంలోనే సమాధానముంది చూడండి..
మరి 41 అడ్డం స్లిప్పు ఇవ్వగలరా?? నేను చేసింది కరెక్ట్ కాదనుకుంటున్నాను.
నాకు అడ్డం 7,23,26 ఇంకా నిలువు 18,31,39 కొంచం డౌటు .. అందుకే చివర్లో ఇస్తున్నా .. :
అడ్డం:
1. పైకెన్ని నాటకాలాడినా సమైక్యవాదులకీ, తెలంగాణావాదులకి కావాల్సినది ఇదొక్కటే!
9. ఆలాపించండి మరి రాగాలని
10. కుక్క తోక కాదు పక్క తోక కొంచం తెగింది
12. మిస్టర్ మదన్, ఐ ఏం ఏ బేబీ!
15. బాణాలేసేవాడు కాదండోయ్ - వీడో రాక్షసుడు
16. కామ్రేడ్ మారెప్ప టూకీగా రెండూ వాక్యాల్ని కలుపుతాడు
17. పక్కవాడికి ఎప్పుడూ చెప్పేది :))
18. తోకతెగి ' మార్ ' పోయిన పిల్లి
19. వుడ్డో వుడ్డు
22. బామ్మర్దీ! ఇప్పుడే వచ్చితిని
24. ఝలక్కులో కూడా అదృష్టం
25. సీబీ రావుగారి పూర్తిపేరేమిటబ్బా?
27. తురుము ఖాన్ కి తోక తెగి తల బరువెక్కి మిగిలిన చివరకూడా కాస్త తెగింది
30. విష్ణువుకి, కోతికి భాషాపరమైన సంబంధం ఏమిటబ్బా?
32. లక్ష్మీ దేవి
33. కొరుక్కొనేది కాదండీ - కానీ అలాంటిదే!
34. ఒడ్డు
36. రాముడి కొడుకులో కొంచమా?
38. స్వరాలు తిరగబడినవెంటనే తల తోక మిగిలి మొండేం పోయింది!
40. కమాన్ గోల్డెన్ అంకుల్!
41. కందబ్లాగులో వెతకండి, లేకపోతే శిరాని అడగండి
---------------
సందేహమున్నవి:
7: మహిళా ఫైటరా?
23: ఇదుంటే మగాడు, ఇది కొడితే మాత్రం ఛస్తాడు :))
26: కృష్ణమ్మది వాల్జడ అయితే గోదావరిది?
---------------
నిలువు:
1. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపేరు తిరగబడి తను కట్టించిన దాని తలకి అతుక్కుపోయిందే!
2. మెగాస్టారుకి తెలంగాణవాదులు ఇచ్చిన కొత్త బిరుదు
3. స్టూవార్టుపురం పక్క ఊరికి వెళ్ళద్దంటే విన్నారా? ఇప్పుడు చూడండి, తలతెగి తోక సాగిపోయింది దానికి
4. బ్రాహ్మణుడే, కాస్తంత వికృతంగా నాలుగక్షరాలతో
5. నదులు తిరగబడితే చివళ్ళు సముద్రంలో కలిసిపోవూ మరి?
6. పలచగానే ఉంది కానీ కాస్త అటు ఇటూ అయింది
8. నారదుడు తన వీణ పట్టూకుని నినాదం చేస్తుంటే మధ్యలో ఈ నీరదుడెవరో?
11. సో, తెలుగులో కాస్త సాగితే ఏమౌతుంది?
13. తన భార్యవల్ల విష్ణువుకి, శివుడికి ఎంత కోపం తెప్పించినా మన మాజీముఖ్యమంత్రండీ!
14. చుప్పనాతిలో కూడా స్త్రీ ఉందా?
15. అమ్మో ఇది బ్రహ్మవాక్కు
19. పేదకడుపు తోకతెగి చిందరవందరయ్యింది
20. లావా తీవ్రత తగ్గి రాముడి కొడుకైపోయింది
21. పండని కాయలోంచి వచ్చిన నెత్తురా?
28. తెలుగులో కాదు హిందీలో ఆగండి
29. సృంతులు వ్రాసినవాని తలని చెరకుగడ తోకకు తగిలించడమే జీవితం
32. రంగా? కాదేహే అదో జబ్బు!
36. తెలుగులో చాలదా? ఉర్దూలో కూడా దెబ్బలాడుకోవాలా?
37. "ఉన్నారా?" - "అబ్బే! ....."
--------------------------------------
సందేహమున్నవి:
18. జాబా? ఎక్కడ? హ్రస్వమయ్యి తిరగబడ్డ మూలా?
31. "చిందరవందరైన బాడీనా?" .. "అబ్బే! నీకు శ & స ల మధ్య తేడా తెలియదా?"
39. బుర్రలేని ఉలేమాగారు
రౌడీగారు, మీరొచ్చేలోపు గడి పూర్తయింది. ఈసారి కాస్త వీజీగానే ఉంది. 41 ఒక్కటి కాస్త డౌట్ గా ఉంది. ఇప్పుడు సరిచేసాను.
రౌడీ గారూ,
23 అడ్డం - దడిగాడు వాన సిరా .... గాడిద తిరగబడి వెనక్కాలితో తంతే గా ఎగిరిపోయింది.
Thanks Sankarayya gaaru, sarichesukunnaa ...
elaagu nenu pampimchanugaa :))
http://turupumukka.blogspot.com/2010/01/blog-post_09.html
అడ్డం 25, 41 రావటం లేదు. దయచేసి ఎవరినా సులభమైన క్లూలు ఇవ్వండి.
అపరంజిగారు,
అడ్డం 25 - A for Ant
అడ్డం 41 .. పువ్వులు, దవనం, కనకాంబరాలు కలిపి అల్లే మాలను ఏమంటారు. లేదంటే శిరాకదంబం బ్లాగు చూడండి.
Post a Comment