Thursday, November 19, 2009

నవంబరు నెల గడి - 2009

హమ్మయ్య..ఏదో కాస్త వీజీగా ఉంది కాబట్టి గత నెల త్రివిక్రమ్ ఇచ్చిన గడి చాలా మంది తప్పులు లేకుండా పూరించారు.
ఈ నెల గడి భైరవభట్ల కామేశ్వర రావుగారు ఇచ్చారు. ఎప్పట్లాగే మెలిక పెట్టి . చూద్దాం ఎలా ఉందొ.. కొన్ని స్లిప్పులు ..


1 నిలువు - ఈ రోజుల్లో అబ్బాయిలకు వంటావార్పూ తప్పక రావాల్సి ఉంది మరి..

3 నిలువు - ఆదివారం క్రిస్టియన్లు చెప్పే మంచివార్తలు.

3 అడ్డం -సురేఖ కారం తినగానే ఖ ఎగిరిపోయిందట. పోతేపోనీ. దానితో టపాసులు చేసుకుందాం

6 అడ్డం -ఈ టీపా య్ ని తన్నకండర్రా? అంచులు విరిగిపోతాయి.

6 నిలువు - చిన్నప్పుడు తప్పనిసరిగా వేసేవారు. ఇప్పుడైతే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.

32 అడ్డం - పుల్లగా ఉన్నా తియ్యగా ఉంటారు మరి ఈ రెడ్డిగారు.

36 అడ్డం - ఆ లక్ష్మణుడిని ప్రేమగా,మాడర్న్ గా పిలవండి.

35 నిలువు - మహావిష్ణువు రెండో అవతారం

37 అడ్డం - ఏంటో ఇవాళ పరాకుగా ఉన్నారు. ఏమైంది?

26 నిలువు - అబ్బ ఇదంటే నాకు చాలా ఇష్టం.దీనికోసం బంగారం కూడా వదులుకుంటాను. ఇదేపేరుతో నవీన్ బ్లాగు ఉంది.

28 నిలువు - తలుపు మీద "టకటక" మని చప్పుడు వినపడింది..ఎవరది?

మిగతా స్లిప్పులు ఎవరైనా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది...

26 comments:

aparanji said...

నేను తప్పుగా అర్ధంచెసుకుంటే నన్ను సరిచెయ్యండి

36 అడ్డం లెదు, నిలువే వుందనుకూంటాను . 36 అడ్డం కు ఇచ్హిన క్లూ 37 అడ్డం కి సరిపొతుందెమో చూడండి.
26 నిలువు లెదేమో 26 అడ్డమే కనపడుతోంది, 26 నిలువు ఆంకె గడి, 13 నిలువులొ భాగం కాదా?

జ్యోతి said...

అవునండి అపరంజిగారు, క్షమించాలి.నంబర్లు చూసుకోలేదు. ఇదిగో సరిచేసాను.


33 అడ్డం - పుల్లగా ఉన్నా తియ్యగా ఉంటారు మరి ఈ రెడ్డిగారు.
37 అడ్డం - ఆ లక్ష్మణుడిని ప్రేమగా,మాడర్న్ గా పిలవండి
27 నిలువు - అబ్బ ఇదంటే నాకు చాలా ఇష్టం.దీనికోసం బంగారం కూడా వదులుకుంటాను. ఇదేపేరుతో నవీన్ బ్లాగు ఉంది.

మైత్రేయి said...

similarly, 35 Ni is actually 36 ni

జ్యోతి said...

sorry again ..నిన్న వేరే పని చేస్తూ గడి పూరించసాగాను. అందుకే ఇన్ని తప్పులు..

36 నిలువు - మహావిష్ణువు రెండో అవతారం
35 నిలువు - కృష్ణుడి గర్ల్ ఫ్రెండ్
37 నిలువు - సీతారాముల సుపుత్రుడు.

mmkodihalli said...

నిలువు 7.పిట్టలదొర చేతిలో వుండేది.
అడ్డం 8.మార్పుకందనివాడు లో మన్మథుడు
నిలువు 8. మణిరత్నం దళపతి సినిమాకి?
నిలువు 5. రాంగోపాలవర్మను అడగండి.
అడ్డం 10. కాకి తోక కాదు సుమా.
నిలువు 12. కీర్తికి వికృతి?
నిలువు 15.సున్నాలేని తురంగం.
అడ్డం 16. రంగనాయకుల సతి కులట కాదు సుమా!
అడ్డం 23.సుధాముడే! శ్రీకృష్ణుని జిగిరీ దోస్త్.
అడ్డం 24.అమృత్‌సర్ ఈ రాష్ట్రంలోనే ఉన్నది.
నిలువు 25.చెస్
అడ్డం 26.ఉప్మా దీనితోనే చేస్తారు కదా?
అడ్డం 28. మహమ్మద్ ఖదీర్ బాబు ఈ నెల్లూరి మాండలికం కథల వల్లే వెలుగులోకొచ్చాడు.
నిలువు 33.గండూషము అంటే పులకింత కాదు.
అడ్డం 41. ఈ నవత మీ నవత కాదండి.

జ్యోతి said...

34 అడ్డం
13 నిలువు
19 నిలువు
11 నిలువు
స్లిప్పులు కావాలి..

మురళీమోహన్ గారు 8 అడ్డం,నిలువు అర్ధంకాలేదు.

కంది శంకరయ్య said...

జ్యోతి గారూ,
34 అడ్డం - శ్రీకారంతో మొదలయ్యే రాగం. తిరగెయ్యండి.
8 నిలువు - మమ్ముట్టి, రజనీకాంత్ నటించిన మణిరత్నం సినిమా.
8 అడ్డం - దర్పం కలవాడికి కం కలిపితే మన్మథుడు. అందులో కం కీలకపదంలో కలిసింది.

mmkodihalli said...

నిలువు 19. అ. ఆ. ఇ. ఈ. లో నటించిన మళయాళ కుట్టి
నిలువు 13. నారద సుధాముస సరిచెయ్యండి.
అడ్డం 34. సరాగం కాదు శ్రీ _ _
నిలువు 8. తెలుగు డైరెక్టర్
అడ్డం 8. కందర్ప దర్ప భంగ అని మన్మథుని గర్వభంగం చేసిన శివున్ని నుతిస్తాము

Malakpet Rowdy said...

అన్నిటికన్నా నాకు 5 నిలువు చాలా నచ్చింది

జ్యోతి said...

హమ్మయ్యా. ఇవన్నీ వచ్చాయి. కామేశ్వరరావుగారు భలే చమత్కారంగా ఇచ్చారు. నేనేదో పురాణాల్లోకి వెళ్లిపోతున్నా.
చివరిలో రెండు సందేహంగా ఉన్నాయి .నేను చేసింది రైటో కాదో అని..

20 అడ్డం
11 నిలువు

Unknown said...

38 అడ్డం, 38 నిలువు అర్ధం కావట్లేదు.క్లూ ఇవ్వగలరా.

aparanji said...

38 అడ్డం జ్యొతి గారు ఇచ్హిన క్లూ చూడండి ఐనా చిరాకు తరువాత వచ్హేది.

38 ఇక ఇకల తరువాత వ్చ్హే ఒకటి

జ్యోతి said...

38 అడ్డం..ఇకఇకల తర్వాత వచ్చేవి..

నా గడి ఐపోయిందోచ్.. కీలకపదాన్ని పట్టుకుంటే పని ఐపోతుంది.ఈసారి గడి పూర్తిచేయడానికి మన బుర్రలోని సినిమా పరిజ్ఞానాన్ని కాస్త స్పూనుతో తిరగతోడితే సరి..

Venkat said...

కీలక పదం:తెలుగు లో మొదటి నవల రాజశేఖరచరిత్ర వ్రాసినాయన ఈయనే.

mmkodihalli said...

11 నిలువు
స్లిప్పు కావాలి.

Venkat said...

11 నిలువు : కె.సి.ఆర్ ఇంటిపేరులొ మొదటి రెండక్షరాలకి పాతాళభైరవి కధానాయిక పేరులొ మొదటి రెండక్షరాలు కలిపితే సరి

కామేశ్వరరావు said...

మురళీమోహన్ గారు,

11 నిలువు ఆధారంలో చిన్న పొరపాటు దొర్లింది. బహుశా అందుకే మీకు స్లిప్పు కావలసి వచ్చింది :-)
సరైన ఆధారం "ఎఱ్ఱ కలువకి హారమెక్కడినుంచి వచ్చింది".
తప్పు తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు. జ్యోతిగారు, మీ సమాధానం సరిచూసుకోండి!
పొద్దులోకూడా కామెంటు పెడతాను.

జ్యోతి said...

కామేశ్వరరావుగారు, నా బండి ఇక్కడే చాలాసేపు ఆగింది. కాని ఏదైతే అయ్యింది లెమ్మని వెంకట్ గారు చెప్పినట్టు కాలువను కుదించాను.:)ఐనా పొద్దు గడి ఎన్నిసార్లైనా పంపొచ్చుగదా అనే ధీమా కూడా ఉందండోయ్..

కంది శంకరయ్య said...

వెంకట్ గారు చెప్పింది తప్పనుకుంటా.
11నిలువు - హింది నిన్న లేదా రేపుకు హారమును కలపండి.

Venkat said...

11 నిలువు:శంకరయ్య గారు చెప్పిందే ఒప్పుగా అనిపిస్తోంది.నేను ఇదే అనుకున్నా కాని అది గడిలో ఎలా వ్రాయాలో అర్ధం కాలేదు.ఇప్పుడు సరిపొయింది.

aparanji said...

అడ్డం 14 రావటం లేదు క్లూ ఇచ్హి పుణ్యం కట్టుకోండి
మిగిలినవి రమారమీ గా వచ్గ్గినట్లు గానే అనిపిస్తొంది

mmkodihalli said...

అడ్డం 14. తులాభారం బరువును కోల్పోయి తిరగబడింది.

కంది శంకరయ్య said...

జ్యోతి గారూ,
గడిని నింపుతూ లకు హవత్తు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా వీలుకావడం లేదు. ఎల్ నొక్కి హెచ్ నొక్కితే ళ వస్తోంది. లేఖినిలోను ఇదే సమస్య. పరిష్కారం ఏదైనా ఉందా?

mmkodihalli said...

శంకరయ్యగారూ ఎల్ తరువాత & నొక్కి ఆతర్వాత హెచ్ నొక్కి చూడండి.

కంది శంకరయ్య said...

మురళీ మోహన్ గారూ,
మీరు చెప్పింది నిజమే. ధన్యవాదాలు.

Unknown said...

మురళీ మోహన్ గారు, ల కి హ వత్తు రావాలంటే & నొక్కితే రావటం లేదు ^ ఇది నొక్కితే వస్తోంది.

Post a Comment