ఈ నెల గడి పొద్దు సంపాదకులు త్రివిక్రం గారు ఇచ్చారు. చూడగానే వచ్చిన వాటికి కొన్ని స్లిప్పులు..
1 అడ్డం..ఈ ఊరిలోచల్లనమ్మబోదురంట
12 అడ్డం.. ఇనుప పెనంపై తడి ఉంటే త్వరగా పట్టుకుంటుంది.
17 అడ్డం.. ఈ బ్లాగరి చాలా రోజులనుండి కనపట్టంలేదు. ఎవరికైనా తెలుసా??
4 నిలువు..ఈ ముద్రలో లోపాలున్నాయి. చూసుకోండి..
9 అడ్డం - చదరంగంలో కదిపేవి.
Saturday, October 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
21 comments:
నిలువు1... వాసిరెడ్డి సీతాదేవి నవల. ఒకప్పుడు నిషేదానికి గురయ్యింది కూడా.
అడ్డం5... ఆటవెలదికి జోడీదార్.
అడ్డం14... లెక్లాంచి కూడా మొండివాడేనా?
అడ్డం19...కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు ఇది వస్తుంది.
అడ్డం26...మూడు జడల రాకాసి.
26 అడ్డం... అల్పాహర ---- సేవించండి
31అడ్డం... పాత యువ లు చదవండి, కనీసం బొమ్మలయినా చూడండి.
37 అడ్డం... దేశ రక్షణ్ గురించి ఆలోచించండి.
24 నిలువు... మెరపులత.
6నిలువు... ముళ్ళపూడి రాత బాపు --.
మురళీమోహన్ గారు,
14, 26 అడ్డం అర్ధం కాలేదండి..
లక్ష్మిగారు, 28 అడ్డం అనుకుంటాను.
మరికొన్ని స్లిప్పులు
2 నిలువు
అనగ అనగ రాగం అతిశయిల్లు
21 నిలువు
పెళ్లిల్లు జరిగేవి కూడా ఇక్కడే
16 నిలువు
గడి స్లిప్పుల సర్వీసు మొదలెట్టిన సాహిత్యం బ్లాగర్. చాలారోజుల తర్వాత మళ్లీ వచ్చారు.
జ్యోతిగారు,
28 అడ్డం కరెక్టండి. పొరబాటున 26 రాసాను. తొలి ప్రయత్నం కదా మరి!..
14 అడ్డం...విక్కు వినాయక్ ని గుర్తు తెచ్చుకోండి.
26 అడ్డం... అశోకవనం సీత గుర్తుకువచ్చిందా...
22 addam, 27, niluvu 23 clues please
27నిలువు... ఆ పదం లోనె పరిష్కారముంది. జాగర్త గా చూడండి. లేదంటరా భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు పాట గుర్తు చేసుకోండి.
23 నిలువు...ముఖము
22 అడ్డం - ఇచ్చిన ఆధారంలో 'దేవన యశం'ను సరిచేస్తే అలెగ్జాండర్ ఏ దేశంనుండి వచ్చాడో తెలుస్తుంది.
నాకు చాలా స్లిప్పులు కావాలి.
27 అడ్డం, నిలువు
40 నిలువు
36, 52, 43, 45 అడ్డం
41 నిలువు.
రౌడీగారు రీమిక్సులలో మునిగిపోయి ఇటువైపు రావడంలేదు.శంకరయ్యగారు మీరైనా ఇక్కడ ఉన్నవి కాక మిగతా స్లిప్పులు ఇచ్చేస్తే ఓ పనైపోతుంది..
27 అడ్డం - మలబద్ధకం తొలగించే ప్రశస్తమైన నూనె.
27 నిలువు - కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా ... సముద్రం నుండి హిమాలయం దాకా ..
36 అడ్డం - కద్రువకు సవతి. సూర్యుని సారథి అనూరుడి తల్లి.
52 అడ్డం - విష్ణుదేవుడి వాహనం. 36 అడ్డంకు కొడుకు.
43 అడ్డం - యాభై శాతం.
45 అడ్డం - రవిక అని రూఢ్యర్థం. కంచు కనకములో నక పోతే?
41 నిలువు - ఇచ్చిన ఆధారంలో చివర ఉన్న 'పాపముగదా' లో 1+3+2+4-5=?
39 అడ్డం, 41 నిలువు వచ్చాయనే అనుకుంటున్నా. కాని కొద్దిగా అనుమానం.
39 ,45 ,42 aDDam
35,40 niluvu please.
addam
42 allari maanavaa ani pillanu keekavesi choodamdi
45 baammagaari kamcu chembu chembu pooimdi, ika kanakamuloni bomgaaramuu poindi
39 అడ్డం - జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి పేరు
35 నిలువు - గోవాకు చేరువలో దీవులు రాక్షసనీతి అని కూడా అంటారు
32, 40- నిలువు కావాలి..
లక్ష్మిగారు, 14 అడ్డంకు మీరు చెప్పిని స్లిప్పు అర్ధంకాలేదండి..
14 అడ్డం - వాడొక మొండి .......! కుండను సంస్కృతంలో ఏమంటారు?
32 నిలువు - దీనికి క్లూ ఇవ్వడం "అవసరమా"? అవసరము కాదు.
40 నిలువు - 39 అడ్డం,42 అడ్డం, 51 అడ్డంతో మూడక్షరాలు వచ్చాయి. వాటినిబట్టి జవ(రా)లు అనుకుంటున్నా.
శంకరయ్యగారు,
మీరు చెప్పింది నిజమే.నేను అలాగే పెడుతున్నాను.ఆదారానికి కాస్త పక్కకు జరగక తప్పదేమో. అంటే అక్షరాలను అటుదిటు చేస్తేనే సరిగ్గా సరిపోతుంది ఈ పదం..నేను పంపేసాను. చూద్దాం చివరివరకు ఎవరైనా దీనిని దిద్దుతారేమో.
జ్యోతి గారూ, 39 అడ్డానికి మీరు చెప్పిన ఆధారం ఓసారి చూడండి. ఆ సినిమాలో శ్రీదేవి పేరు ఇంద్రజ. ఇక్కడ అది సరిపోదు కదండీ?
వేణుగారు,
నిజమేనండి.. కాని ఇందులోని చివరి జ ను తీసుకుని మిగతావి వదిలేస్తే సరి.:)
గడి కూర్పులోనే స్లిప్పులిచ్చేసినంత పని చేశారు... త్రివిక్రమ్ గారు!
అయినా - అందరికీ చటుక్కున తోచవేమో అనిపించినవి ఇస్తున్నా.
31 అడ్డం: 'చందమామ' ముఖచిత్రంపై పొట్టి సంతకం
46 నిలువు: దేవయాని పేరు చెపితే గుర్తొస్తాడా?
49 నిలువు : తెలుగు సిరి కాదు, తమిళ తిరుచూర్ణం!
నేను ఎప్పుడో పూర్తిచేసి పంపించాను.
How do I leave a comment in telugu? can somebody help me please?
aparanji,
Use this to write in telugu. copy and paste here
http://lekhini.org/
జ్యొతిగారు క్రుతజ్ఞతలు. అబ్బా ఇన్ని రొజుల నుంచి ఎలా రాయాలొ తెలీక నేను పొస్ట్ చెయ్యటానికి చాలా సందెహించాను.
ఇంక దున్నెస్థానని కాదు ప్రయత్నిస్తాను.
Post a Comment