Wednesday, September 23, 2009

సెప్టెంబర్ నెల గడి - 2009

ఈ నెల గడి ప్రొఫెసర్ గారిదే.. ఇప్పుడే చూడగానే నాకు తట్టిన కొన్ని స్లిప్పులు. మీకు తెలిసినవి చెప్పండి.


౩ నిలువు - నదిని రివర్సులో ఈదండి ..

5 నిలువు - వరూధినిగారి బ్లాగును గుర్తు చేసుకోండి


మరికొన్ని సులువుగానే తెలిసిపోతాయి. ప్రయత్నిస్తూ ఉండండి.మళ్ళీ వస్తాను..

13 comments:

కంది శంకరయ్య said...

అడ్డం -
1. సినీనటి "సన" కాదు... మౌనులు
5. చక్కిలిగింతలా ఉండే అశ్వఘోష.
6. పైన చెప్పిన సినీనటిని సాగదీయండి.
9. నాకే సరినంటావా? ఐతే మధ్యలో చూడు.
11. తెలుగు పిల్లలు తెలుగులో నాన్నను వదిలేసారు.
12. ఈ డాక్టరుగారు శృంగార సమస్యలకు సలహాలిస్తుంటారు.
14. అందుకే ఈ రోజు చంద్రుడు నిండుగా నవ్వుతాడు. ( ఆధారంలో గురు చంద్రుల జన్మతిథి అన్నారు. కాని గురువు జన్మతిథి ఏకాదశి. (చూ- సత్యనారాయణ వ్రత కల్పంలో నవగ్రహపూజ.)
15. హ్రస్వాంతమైన హిందీ గాడిద.
17. మురళీధరుడు ఈమెను చంపి మురారి అయ్యాడు.
22. తెలంగాణాలొ ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి జాతరలో మహిళలు నెత్తినెత్తుకొనే కుండలతో సంస్కృత పండుగను కలపండి.
27. నాలుగాక్షరాల పదం. రెండవ అక్షరం "టింగ్" నాల్గవ అక్షరం "పర్"
31. పెద్దగా ఉండే ప్రత్యేక సంచికలను ఎందులో వేద్దాం?
34. జ జారిన జలగ.
36. ఎవరిచ్చినా అదే. కన్నడిగులిస్తే సున్న ఉండదు.
39. సతమతమౌతావెందుకు? మొదటి త తొలగించి చూడు.
42. మీకందం, వారికందం మరి మాకు?
43. తిలలు తెలుగులో.
52. స్వాతిలో బాపూరమణీయం చూడండి.

ఇక నిలువు క్లూలు మరోసారి.

కంది శంకరయ్య said...

నిలువు -
1. రసవంతము. వికటిస్తే విరసము అవుతుంది.
2. సంస్కృతంలో సాకారం ఐన చెరువు.
4. అలుకేమిటయా? తీసేయాలట!
5. అడ్డం 5,11 లతో ఒక ఇంగ్లీషు పేరు వస్తోంది. కరెక్టో, కాదో?
7. తడికపై వాన కురిస్తే క కొట్టుకుపోయింది.
13. అడ్డం 12,17,22,27 వస్తే ఆటోమాటిగ్గా ఇది వచ్చేస్తుంది.
23. మేరా నాం జోకర్, జానీ మేర నాం, నా పేరే భగవాన్.
27. బ్లాగుడుకాయల యూనియన్.
ఇంకా కొన్ని ఉన్నాయి. మా అబ్బాయికి "నెట్"వర్క్ ఉందట. మరోసారి వస్తా...

జ్యోతి said...

19 అడ్డం - ఈ ద్వీపంలో బోల్టు మణులుంటాయంట నిజమా??
26 అడ్డం - దుప్పటి పరచ రా అంటే అటుదిటు వేసాడు..
33 అడ్డం - అక్కడేదో చారలా ఉందే??
51 అడ్డం - 'మర'లే

శంకరయ్యగారు,
5 నిలువు స్లిప్పు నేనిచ్చాను చూడండి. లేదా స్వరరాగ గంగా ప్రవాహమే సినిమా గుర్తు తెచ్చుకోండి.
24 నిలువు సర్వం మిధ్య కాదా??ఐతే ఎందుకలా పైకి , కిందకి చూస్తారు??
21 నిలువు - మగవాళ్లకి పంచలచాపు, ఆడాళ్లకి చీర,జాకెట్టు పెట్టడం సంప్రదాయం.
32 నిలువు - నాగార్జున,శ్రీదేవి విలన్ బంధించిన పిల్లలను విడిపించడానికి ఈపాట పాడతారు. ఇదే పేరుతో వాణిశ్రీ,రమ్యకృష్ణ,జయసుధలతో కన్నీల్లు పెట్టించే సినిమా వచ్చింది.
శంకరయ్యగారు,
5 నిలువు స్లిప్పు నేనిచ్చాను చూడండి. లేదా స్వరరాగ గంగా ప్రవాహమే సినిమా గుర్తు తెచ్చుకోండి.

నాకు 28, 32,45 అడ్డం.... 25 నిలువు కావాలి..

కంది శంకరయ్య said...

జ్యోతి గారూ,
నిలువు 3,5 క్లూలు మీరిచ్చారుకదా అని నేనివ్వలేదు.
ఇక 51 నిలువు మీరు చెప్పింది కాదనుకుంటాను. ఆధారంలో సా "యంత్రా" లే అన్నది గమనించండి.
ఇక మీరడిగిన వాటికే నాకూ క్లూలు కావాలి.

జ్యోతి said...

51 అడ్డం.. మీరు చెప్పింది నిజమే. కాని స్లిప్పులోనే పదం ఇవ్వడం ఎందుకని మరో విధంగా చెప్పాను. :)

Malakpet Rowdy said...

గడి ఇప్పుడే చూస్తున్నా. చాలా స్లిప్పులిచ్చేశారుగా..

సరే 32 అడ్డం - సమర్ధుడైన స్వామి

mmkodihalli said...

నిలువు 38. ప్రతాపరెడ్డి ఇంటిపేరేనా ఇదేం తిరకాసు?
నిలువు 47.తలతిరుగుడు రచయిత్రి అని శ్రీశ్రీ ఉవాచ

Unknown said...

అందరికీ దీపావళి శుభాకాంక్షలు :)

22 అడ్డం సంస్కృత పండుగ అంటే ఏమిటండి? @ శంకరయ్య గారు

37 అడ్డం అజీర్తి చేస్తే సోంఠి పొడి వేసుకుంతారు కదా? చూస్తుంటే అది కాదులా ఉంది?

19 అడ్డం ఏ ద్వీపం లోనండి అర్ధం కాలేదు@ జ్యోతిగారు
28 అడ్దం ,25 నిలువు ,45 అడ్డం ఎవరికైఅన తెలిస్తే క్లూలు ఇవ్వరా?

52 అడ్డం వెంకీ సినిమానే కదా?

జ్యోతి said...

22 అడ్డం - భారతంలో ఉన్న భాగాలను ఏమంటారు?
19 అడ్డం -అబ్బో ఇక్కడ మణులు, మాణిక్యాలు బోల్డు ఉంటాయంట..
52 అడ్డం -కాదండి .. స్వాతిలో బాపు రమణలు చేస్తున్న గోల!!

మిగతావి నాకు కూడా రాలేదుమరి...

Unknown said...

22 ,52 అడ్డం కి క్లూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి

19 అడ్డం మటుకు రావటం లేదు గూగుల్ లో వెతికితే ద్వారక? శ్రీరంగం? ఇలా వస్తున్నాయి.

28 అడ్డం వచ్చినట్టె ఉంది.

45 అడ్డం చివర హారం అనే అర్ధం వచ్చేటట్టు వచ్చింది కానీ మొదటి రెండక్షారాలు ఏమొస్తాయో తెలియటం లేదు

20 ,25 నిలువు , 38,41 నిలువు రావటం లేదు

Unknown said...

1 అడ్డం మౌనులు అంటే వరలక్ష్మి వ్రతం కథలో మునులు వస్తారు వాళ్ళేనా? వాళ్లైతే 1 నిలువు కుదరదనుకుంటా కదండీ :-?

జ్యోతి said...

శ్రీలు,

19 అడ్డం చాలా వీజీ మీరు ఎప్పుడైనా diamond island పేరు వినలేదా??

1 అడ్డం అదే సత్యనారాయణ వ్రతంలో కూడా పలకరిస్తారు..ఇక నిలువు అంటారా? కాస్త సరసంగా ఆలోచించాలి మరి.. :)
41 నిలువులో అమ్మడిని హొయలు ఎక్కువయ్యాయి కులుకకో యని కాస్త మందలించండి.

45 అడ్డం ఇది కూడ డైమండ్ దండ..
31,33, 19 అడ్డాలు వస్తే 20నిలువు కూడా వచ్చేసినట్టే..

ఇక మిగిలింది 25 నిలువు, 28 అడ్డం,37 అడ్డం, స్లిప్పులు కావాలి. ఎవరైనా దాతలు ఉన్నారా. ఒక్కరోజు మిగిలింది...

Unknown said...

28 అడ్డం కి 'హర్షం ' తెలుగు టు ఇంగ్లీషు డిక్షనరీ లో చూడండి (చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ) మొదట్లోనే ఉంటుంది. ఆ తర్వాతా దానిని అటు ఇటు మార్చండి (ఇది కరెక్టే అనుకుంటూ ఇస్తున్న క్లూ )

థ్యాంక్స్ అండి 19 అడ్డం వచ్చినట్టే ఉంది :)

అయితే 1 నిలువు కొంచెం సరసం గా ఆలోచించాలన్న మాట ;)

30, 38 నిలువు వస్తే 37 అడ్డం దాదాపు వచ్చినట్టే కదా? నాకు 38 నిలువు రాలేదు :(

Post a Comment