Monday, August 24, 2009

ఆగస్టు నెల గడి - 2009

హమ్మయ్యా!!! ఈ నెల గడి కాస్త సులువుగానే ఉంది . కూర్పరి ప్రొఫెసర్ గారు దయతలిచినారు.

ముందుగా కొన్ని స్లిప్పులు..

1 అడ్డం - బండి మీద కాని, బండార్ లోకాని తప్పనిసరిగా ఉండే ఆలూ ఐటం ఇది
1. నిలువు - అందరికి తెలిసిన రేలంగి మావగారే.. ఆ ఏడుకొండలవాడిని తలుచుకోండి.
7 అడ్డం - గంప
24 అడ్డం - రిమ్ జిమ్ హైదరబాద్
4 నిలువు - ఈ నాలుగు విషయాలలో తోడుంటానని పెళ్లిలో ప్రమాణాలు చేయిస్తారు.
8. అడ్డం - పూరి చేసినప్పుడు ఇది కూడా తప్పకుండా చేయాల్సిందే మరి..
18 నిలువు - ఇవి ప్రతివంటింట్లో ఉండే వస్తువులే కిందా మీదా అయ్యాయి అంతే.
21 అడ్డం - చంద్రబాబు మీద దాడి జరిగింది ఇక్కడే కదా
37 అడ్డం - బాలాజి నుదుటి మీద ఉండేవి అవేగా.
42 అడ్డం - ఫేమస్ పిజ్జా ..ఇది ఈజీనే.. పిజ్జాలు తినడం అలవాటు లేకుంటే గూగులమ్మని అడగండి.

20 comments:

Malakpet Rowdy said...

A few to start with:

32 అడ్డం బాలయ్య మూడో ఎక్కం - సిల్క్ స్మితతో! కానీ ఓ రెండక్షరాలు తీసెయ్యాలి
25 అడ్డం - పంజాబు నుండి దిగని పదహారణాల తెలుగు హీరోయిన్. కానీ ఏమి లాభం? పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది.
34 అడ్డం - శ్రీవారికి ప్రేమలేఖ సినీమాలో సుత్తి విరభద్రరావు చేత తిట్టించుకునేంత పాపమేంచేసిందో ఈ పక్షి?
28 అడ్డం - ఇది నలభై అడ్డం తో రైం అవుతుందని నా నమ్మకం - కానీ పొద్దు వారు నలభై ఒకటి అడ్డం అంటున్నారు
9 అడ్డం - డబ్బులా వినిపించినా మీనింగ్ లెస్సే!
21 నిలువు - ఆడదాన్ని శక్తిహీనురాలంటూ రెండూ సార్లు పిలుస్తావా? చూశావుగా, రెండూ సార్లూ మధ్యలో కట్ అయ్యింది?


Rest on demand hehe, as nobody seems to be usning my slips

జ్యోతి said...

భరద్వాజ్ గారు,
మీరు కూడ ఇంత కష్టమైన స్లిప్పులు ఇస్తే ఎలాగండి.పొద్దువారి ఆధారకంటే మీవే ఒక్కొసారి కష్టమనిపిస్తుంది. కాస్త వీజీగా ఇవ్వండి.
నాకు
17 అడ్డం
16, 23 నిలువు
33 అడ్డం

ఇంతే ఈ స్లిప్పులు మాత్రమే కావాలి.

మిగతావాటికి ఎవరికన్నా స్లిప్పులు కావాలంటే చెప్పండి..

Malakpet Rowdy said...

Even I have some doubts on them ..

16 niluvu: తలకాయలేని నాగార్జున పెళ్ళాం పధ్ధతిలో లేకుండా రెండుసార్లు :))

23 niluvu: (Not sure): Who put that Blue color on lord Shiva's throat?

కంది శంకరయ్య said...

17 అడ్డం - తమకంటూ ఓ ఆలోచన ఉంటే ముందే కనిపిస్తుంది.
16 నిలువు - లక్కు మళ్ళీ మళ్ళీ లభించదా? మొదటి అక్షరాలు చూడండి.
23 నిలువు - కాల భైరవుని కంఠం తెగింది. అన్నప్పుడు బేసి పదాలను చూడండి.
నాకు 19 అడ్డం, నిలువు, 29 అడ్డం, 33 అడ్డం, 41 అడ్డం, 38 నిలువు ఆధారలు కావాలి.

జ్యోతి said...

19 అడ్డం - "ఆ"మడ మకి ఎదో తాకింది చూడండి
19 నిలువు - బావున్నారా.. బావున్నారా అంటుంటాడు ఈ నటుడు.. అప్పుడెప్పుడో చాట బిజినెస్ చేసాడు కూడా.
29 అడ్డం - నారి నారి నడుమ మురారి.. సంధించండి
33 అడ్డం - ఈ మధ్యే స్వయంవరం చాలా కన్నులపండుగగా జరుపుకున్న భామ శ్రావణపూర్ణిమ రోజు వస్తుందంట..
41 అడ్డం - ఒక్కసారి పిజ్జాకంపెనీల గురించి గూగులమ్మని అడిగి మూడు చుక్కలు దేనికున్నాయో ఏది డామ్మంటుందో చూడండి??
38 అడ్డం - 36 అడ్డం, 41అడ్డం వస్తే ఇది వస్తుంది కలవనా అని హిందీలో అడిగి చూడండి..

జ్యోతి said...

10 నిలువు చెప్తారా??నాకు కాస్త సందేహంగా ఉంది.

Anonymous said...

10 నిలువు: 9, 14, 17 వస్తే ఇది వచ్చేసినట్లే కదా? అయినా సందేహంగా ఉంటే నివృత్తి కోసం ఎక్కడికెళ్ళాలో మీకు తెలుసు. :)

జ్యోతి said...

సుగాత్రిగారు
14, 17 కూడా నాకు వచ్చిన పదాలు సరైనవా కావా అని డౌటు.అందుకే ఇక్కడ బండి ఆగిపోయింది.

17 కాస్త సులువైన స్లిప్పు ఇచ్చుకోండి..

కంది శంకరయ్య said...

జ్యోతి గారూ,
మీరిచ్చిన 18 నిలువు క్లూతో నిన్న నేను 23 నిలువుకు ఇచ్చిన క్లూ తప్పని తెలిసింది. సారీ!
ఇప్పుడు సరిచేస్తున్నా. అయినా మలక్ పేట్ వారు క్లూ ఇచ్చారుగదా..
23 నిలువు - నేనింతకు ముందిచ్చిన క్లూలో కాలభైరవుణ్ణి నీలభైరవుడిగా మార్చండి.
10 నిలువు - ఒకందుకంతా స్లిప్పులు ఇచ్చేవారే. మొదటి పదంలో ఆద్యంతాలు ఒగ్గేసేయండి.
14 అడ్డం - ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే. కాదు కదా?
ఇక 17 నిలువు నాకూ సందేహమే. క్లూ కోసం చూస్తున్నా.

జ్యోతి said...

మురళీమోహన్ గారు.

ఇప్పుడే చూసాను.కాని ఒక్కటి కూడా అర్ధం కాలేదు. దానికోసం ఇంకో బ్లాగు చదవాలి కదా. ఈ గడిలో ఒక్క స్లిప్పు దొరికితే పొద్దుకు పంపేసి అక్కడికి వచ్చి ప్రయత్నిస్తాను.

Anonymous said...

10 నిలువు: గుండ్రనిది కదా? అందుకే తిరగేసి చూసినా రూపం మారదు.
17 అడ్డం: ఒకవిధంగా తహతహ అనుకోవచ్చు. తడబడితే పొలం దున్నుకోవచ్చు. :)

జ్యోతి said...

సుగాత్రిగారు

థాంక్స్ అండి :).. .గడి పూర్తి చేసి పంపేసాను.

జ్యోతి said...

సుగాత్రిగారు,

17 నిలువు కాస్త డౌట్ గా ఉంది.. మీరు చెప్పగలరా??

Unknown said...

26 నిలువు ,అడ్డం, 29 అడ్డం
30 అడ్డం ,నిలువు
35 నిలువు ప దగ్గర ఆగిపోయింది :(
వీటిల్లో ఎవరికైనా ఏమైనా క్లూస్ తెలిస్తే కాస్త చెప్పరా ప్లీజ్

కంది శంకరయ్య said...

26 నిలువు - పద్మాల వంటి కన్నులు కలది. "... లందు వైవాహికములందు బొకవచ్చు నఘము వొంద దధిప!"
26 అడ్డం - ఇది నాకూ డౌటే.. కాని 26 నిలువు మొదటి అక్షరం, 17 నిలువు, 4 నిలువుల చివరి అక్షరాలు కలిస్తే "వానాకాలంలో కురిసేవి" వచ్చింది. నేనదే నింపి పంపాను.
29 అడ్డం - నాగరికం - బేసి అక్షరలు.
30 ఆడ్డం - అడ్డబాస - కిలాడిని తిరగేసి డి స్థానంలో బు వేయండి.
30 నిలువు - సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారె అయినట్లు బుద్ధి లేని నాయకులు ?
35 నిలువు - ముక్కులో ఉండే ఘనపదార్థాన్ని గుర్తించలేదటే పక్కున నవ్వుతారు.

జ్యోతి said...

శంకరయ్య గారు

17 నిలువు స్లిప్పు కావాలి.. ఇవాలే ఆఖరు తేదీ కదా..

కంది శంకరయ్య said...

17 నిలువు - "తనదరి" చేరి అక్షరాలను సరిచేయండి.

జ్యోతి said...

శంకరయ్యగారు,

ధన్యవాదాలు.ఈ ఒక్క స్లిప్పుతో గడి పూర్తిచేసి పంపాను. అన్నీ కరెక్టే అనుకుంటున్నాను మరి...

Unknown said...

చాలా చాలా థ్యాంక్స్ అండి శంకరయ్య గారు గడి పూర్తి చేసి పంపించాను :)
నాకైతే అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు !

సత్యసాయి కొవ్వలి Satyasai said...

గడి కూర్పరులకి తట్టని ఆధారాలు స్లిప్పులసర్వీసులో దొర్లడం ముదావహం. ముఖ్యంగా రౌడీగారి క్రియేటివిటీ మెచ్చుకోతగ్గది. నంబర్లలో గడబడయింది. కొన్నిసరిచేసినా ఒకటి ఇంకా ఉండిపోయింది. అయినా వాటిని సరిచేసుకుని సరిచూపి కరెక్టుగా పూరించేసిన ఔత్సాహికులందరికీ నా అభినందనలు. వింతేమిటంటే ప్రశ్న పత్రం చాలా సులువుగా ఇచ్చాననుకున్నప్పుడల్లా నాస్టూడెంట్లు కష్టంగా ఉంది అని నన్ను ఆశ్చర్యపరిచారు. అగస్టు గడి కాస్త కష్టంగా ఇచ్చాననుకుంటే జ్యోతిగారు చాలా సులువుగా ఇచ్చానని అనడంతో మళ్ళీమళ్ళీ ఆశ్చర్య పరిచేసారు.
ఇలాగే నెలనెలా ఉత్సాహంగా స్లిప్పులిచ్చుకుంటూ గడి పూరిస్తూ మీరందరూ ఈవిధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

Post a Comment