Monday, July 27, 2009

జులై నెల గడి - 2009

వాన కోసం ఎదురుచూసినట్టుగా గడి ఫలితాలు, కొత్త గడి కోసం ఎదురు చూడక తప్పడంలేదు. అయినా పేపర్లు దిద్దడానికి ఇన్నిరోజులా.

ఈసారి కామేశ్వరరావుగారు గడిని తయారు చేసారు. కాస్త తికమకగా ఉంది అనిపించింది. ఇంతకు ముందులాగే కీలకపదం ఉంది. గడి చూడగానే తెలిసిన కొన్ని పదాలకు స్లిప్పులు ఇదిగో.. మిగతావి రేపు చూస్తాను. ఇంకా ఎవరికైనా స్లిప్పులు దొరికితే .. తట్టితే ఇలా ఇచ్చేయండి..


33 నిలువు - చొక్కాలకు గుండీలు పెట్టకుండా వదిలేయడం కూడా ఫ్యాషనే..
36 నిలువు - సన్మానం చేసేటప్పుడు పూలదండతో పాటు తప్పక ఉండేది.
39 నిలువు - ఇంకా మాటలు రాని పసిపిల్లలు ఇలా ఏడుస్తారు. అదే వారి బాష మరి.
41 అడ్డం - ఒక్కసారి స్కూలు పాఠాలు గుర్తుకు తెచ్చుకోండి. ఆధారంలోని పదాన్నే అటుదిటు చేయండి..

25 comments:

సుజాత వేల్పూరి said...

8 అడ్డం: శత "పత్ర" సుందరిలో కూడా ఈ సిగ్గు తిరగబడే ఉంది చూడండి.(క్లూ కి క్లూ:) ఈ క్లూ ఇంతకు ముందోసారి గడిలో ఇచ్చిందే!

1. నిలువు: ఆకు కాదు కానీ రోలుకు మంచి జత.

16 అడ్డం: దీనికి పూర్తిగా క్లూ ఇవ్వడం కుదరదు. అర్థ భాగం చాలు.

21 అడ్డం:- శ్రీదేవి హిందీ సినిమా

25 అడ్డం:-న్యూసు
25 నిలువు:- బలుపు కానిది

32 నిలువు: పాపం సత్యభామ కోసమేగా దొంగిలించింది?ఎర్రని కాడ ఉండే తెల్లని పూల చెట్టు.

Vani said...

4. అమెరికా దేశం లో ఇది వాడక తప్పదట కదా

Malakpet Rowdy said...

ప్రస్తుతానికి ఒకటే స్లిప్పు ఇస్తున్నా - కీలకపదానికి!


42 అడ్డం: చిరంజీవి చేత "రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ" పాడిద్దామా? కానీ వాడు సామాన్యుడు కాడే?

Malakpet Rowdy said...

కామేశ్వరరావుగారూ, కరెక్టేనా? కాదనకండీ! సగం గడీ పూర్తి చేస్తే గానీ తట్టలేదు ఇది వా వా వా వా!

Vani said...

@రౌడి, మీ క్లూ నాకు అర్ధం అయింది. కాపి కొట్టాను కనుక మీది తప్పైతే నేను తప్పుతా..

కాని పొద్దులో ఇలా వ్రాసారు, దేని అర్ధం ఏమిటో కొంచం ఎవరైనా చెప్పరా

"సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు."

Vani said...

3. Ni. is it Chalam's Novel?

40. Addam , related to three PMs. not a PM himself.

Malakpet Rowdy said...

what they mean is .. if you take 11 columns and 11 rows .. the picture is symmetric ..

mmkodihalli said...

ఈ క్రింది వాటికి స్లిప్పులు కావాలి ప్లీజ్!

5.నిలువు, 7.అడ్డం, 7.నిలువు, 10.అడ్డం, 11.నిలువు, 14.అడ్డం, 15.నిలువు, 17.అడ్డం, 24.నిలువు, 27.అడ్డం, 29.అడ్డం, 38.అడ్డం

జ్యోతి said...

మురళీమోహన్ గారు,

నాకు కూడా పైవాటికి సమాధానం తట్టడంలేదు. తికమకగా ఉంది . ఈసారికి గడిని గాలికి వదిలేసా..

Malakpet Rowdy said...

7 అడ్డం: అక్షరం అప్పుతో తోకతెగిన తమిళ తెలుగు సరస్సు
5 నిలువు: అక్షరం అప్పుతో చంద్రుడి ప్రేయసి :))
14 అడ్డం: తల్లీ, తండ్రీ, ఓ గంగన్న! టుకీగా :))
15 నిలువు: ఇంగ్లీషు జిగురుతో ప్రమాదం
24 నిలువు: అయ్యో! మా అమ్మ చివర్లో తేలిపోయిందేంఇటి?

మిగతావి రేపిస్తా :))

కంది శంకరయ్య said...

7 నిలువు - ఇచ్చిన ఆధారంలో చివరి పదాన్ని తేలిక చేయండి.
11 నిలువు - ఇచ్చిన ఆధారంలో మొదటి పదాన్ని సరిచేసి సంస్కృతం ఆవును జోడించండి.
10 అడ్డం - దారుణంలో మొదటి రెండు, పాకలులో నడిమిదొకటి, పావనంలో చివరి రెండు.
17 ఆడ్డం - గుర్రం జాషువా గారి ప్రఖ్యాత కావ్యం పేరు.
27 ఆడ్డం - కోతలపుట్టలో దాగిన ఆలోచనా?
అడ్డం 19, 20, 29, 38, 39, 40 క్లూలు కావాలి.

జ్యోతి said...

శంకరయ్య గారు,
గడి ఆఖరు తేదీ ఐపోయింది కదండి..

Anonymous said...

జ్యోతి గారూ,

చాన్నాళ్ళైంది నేను బ్లాగులు చూసి. పొద్దు గడి కోసం ఏకంగా ఒక బ్లాగే ప్రారంభించారన్నమాట! చాలా సంతోషం. ఐనా ఇదేమిటి?
ప్రకటించిన చివరి తేదీతో నిమిత్తం లేకుండా తదుపరి గడి వచ్చేవరకూ పరిష్కారాలు పంపవచ్చనుకుంటున్నానే? ఈ కొత్త నిబంధన ఎప్పటి నుంచి? ఈ వెరైటీ గడులు నేను చూడడం ఇదే మొదటిసారి. ఐనా ఇంత కష్టమైన గడికి మరీ పదిరోజులేనా? నలభై రోజులు కావాలి. ప్రయత్నించేవాళ్లను ప్రయత్నించనివ్వండి. :) పొద్దు సార్లు తప్పక గడువు పొడిగిస్తారు, చూడండి. ఇంతకుముందు ఇలా ఎన్నిసార్లు జరగలేదు?

జ్యోతి said...

సుగాత్రిగారు,
ఎక్కడ మాయమయ్యారండి.. మీకోసం చూసి, చూసి బ్లాగు మొదలెట్టేసాను. అవునండి గడి పూర్తిచేసాక ఫలితాలు తొందరగా ఇవ్వరు. టెన్షన్ లో పెట్టేస్తారు. ఇలా వెరయిటీ గడి ఇచ్చి పదిరోజుల్లో చేయమంటే ఎలా?? అసలే పండగ రోజులు...ఎలా చచ్చేది. నేనైతే పంపలేదు.. పొడిగిస్తే మంచిదే.

Anonymous said...

జ్యోతి గారూ,

అసలు అంతర్జాలం వైపు చూడడమే కుదరలేదండీ ఇన్నిరోజులూ.

హ్మ్మ్మ్మ్...

పైన ఒకరికి ఇద్దరు అడిగారు కదా అని 29 అడ్డం కోసం చూస్తున్నా. అబ్బో... ఇలాంటి గడి పూరిస్తేనే ఉంది మజా! దయగల పెద్దలు 42 అడ్డం ముందే చెప్పేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? 32 నిలువు, 34 అడ్డం లాంటివి నాకు గాంగ తెలుసని పూరించేసి తప్పులో కాలేసి ఇరుక్కుపోయి ఉందును. 29 అడ్డం వినత కాదు. ఇలాంటి తల్లులు సాధారణంగా ప్రజాపతుల్లో ఎవరో ఒకరికి పత్ని అయి ఉంటారు. గుర్తొస్తే చెప్తా. మీకే తడితే చెప్పండి.

కంది శంకరయ్య said...

గడి గడువు ఆగస్ట్ 19 వరకు పొడిగించారు.

Anonymous said...

చూడబోతే స్లిప్పులెవరికీ అవసరం లేనట్లుందే! అందరూ పంపేశారా ఏమిటి? పంపినవారు నాకు 29 అడ్డం స్లిప్పొకటిలా పడేద్దురూ? బదులుగా 38 అడ్డం అందుకోండి: పెళ్ళి తంతేగానీ బరువైన సన్నివేశం కదా? అందుకే ఎంతవారలైనా పరేషానవడం సహజమే.

జ్యోతి said...

సుగాత్రిగారు,

నాకైతేచాలా స్లిప్పులు అవసరమండి. ఎలా అడగను అని వదిలేద్దామనుకుంటున్నాను. కొద్దిసేపాగి నాకే స్లిప్పులు కావాలోచెప్తాను. దొరికితే సరి. లేదంటే తూరుపు తిరిగి దండం పెట్టడమే..

Unknown said...

//పెళ్ళి తంతేగానీ బరువైన సన్నివేశం కదా ?//

అంటే పెళ్ళి లో జరిగే ఆఖరి ఘట్టమే కదా? అదే కనక అయితే 32 నిలువు కి సరిపోదు కదాండి? @ సుగాత్రిగారు

//నాకైతేచాలా స్లిప్పులు అవసరమండి.//
నాకు అంతేనండి జ్యోతి గారు
ప్రస్తుతానికి 12 నిలువు ,అడ్డం ,7 ,15 ,28 నిలువు వీటికి ఎవరికైనా తెలిస్తే కాస్త క్లూస్ ఇవ్వరా

Unknown said...

శంకరయ్య గారు ,
మీరు చెప్పినట్టు చేస్తే 11 నిలువు కి 17 అడ్డానికి సరిపోవటం లేదు ఏమిటి నాకు?

Anonymous said...

శ్రీలు గారూ,

17 అడ్డం, 32 నిలువు సమాధానాలు తట్టాక అక్కడా ఇక్కడా తలను తీసుకెళ్ళి "రఘువంశ సుధాంబుధి"లో ముంచండి. అక్షరాలు తక్కువొస్తే తోకలు పట్టుకుని సాగదీయండి. :)

జ్యోతి said...

12 నిలువు , హందీ నటుడు దేవానంద్ పెద్దన్నయ్యకు కర్తను తగిలించండి
అడ్డం -బాల కనకమయ "చేల" సుజన పరిపాల అని పాడుకోవాల్సిందే
,7 ,నిలువు - ఈ మధ్యే బ్లాగు మొదలెట్టి ఆడవాళ్లకు మంచి ఉపాయాలు చెప్తున్న మహిళా బ్లాగరు పేరుకు సున్నా పెట్టి అటుదిటు చేయండి. అదేపేరుతో తూ/గో/ బ్లాగరు ఇంకొకరు ఉన్నారు ..
15 ,నిలువు - చీరలకు పెట్టేది
28 నిలువు - అదేంటో నేటి ఆడపిల్లలు కడుసుకుమారులమ్మా. కలగాపులగం చేయండి..

శంకరయ్యగారు,
అడ్డం 39 - ఆధారంలోని మొదటి , చివరి పదాలు పట్టుకోండి.
అడ్డం 40 - ధృతరాష్ట్రుడికి మహాభారత యుద్ధం రన్నింగ్ కామెంట్రీ చెప్పినవాడెవరు చెప్మా?

నాకు ఈ స్లిప్పులు కావాలి.. చాలా ఉన్నాయి . తలోరెండు చెప్పినా సర్దుకుపోతాను.
38 అడ్డం అస్సలు అర్దం కావట్లేదు.
2 అడ్డం
17 అడ్డం
19
6 నిలువు
29 అడ్డం

Anonymous said...

జ్యోతి గారూ,
దేవానంద్ పెద్దన్నయ్య ఎవరో నాకు తెలియదు కానీ 12 నిలువుకు సమాధానం తెలుసు. :)
12 అడ్డం మీరనుకుంటున్నది కాదనుకుంటా.
7 కొత్త బ్లాగుల గురించి నాకు అసలు తెలియదు. ఐనా ఇలాంటి పేర్లెవరికుంటాయబ్బా! అక్షరం తేడాతో కాదుగదా?
15 మళ్ళీ మీరు తప్పులో కాలేసినట్లున్నారు.
39, 40. :)
17 అడ్డం: అసలు ఈ నిశీనిష్ ఎవరో చెప్పండి నాకు ముందు.

జ్యోతి said...

సుగాత్రిగారు,

నాకు తెలుసు ఇవి సరియైనవి కావని.ఇలా చెప్తే ఎవరైనా పుణ్యాత్ములు సరిచేస్తారని చెప్పాను. మీరు చెప్పండి మరి.

12 అడ్డం మీనం కాదు కదా.. సెమించాలి. 7నిలువు లోని పండు వెంట్లుక గురించిన స్లిప్పు గడి కూర్పరి బ్లాగులోనే దొరికిందొచ్.
http://telugupadyam.blogspot.com/2009/01/blog-post_24.html#comments

Unknown said...

క్లూలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సుగాత్రి గారు ,జ్యోతి గారు
ఇంకా 4 గళ్ళు ఉన్నాయి పూర్తి చేయటానికి సమయం మించిపోయినందువలన ఈసారి గడి పంపించలేదు!

Post a Comment