ఈనెల గడి కాస్త ఆలస్యంగా వచ్చింది. రానారె సంధించిన గడి ఎలా చూద్దాం.. చూడగానే నాకు తెలిసిన సమాధానాలు..
1. అడ్డం - ఈ పిల్లికి ఎపుడు ఇదే తిప్పలు.
1. నిలువు - బావ మరదలిని ఇలాగే పిలుస్తాడేమో.
2. నిలువు - ఆడపిల్లలు చెమ్మ చెక్కలాడడమే మర్చిపోయారు..
19. అడ్డం - దీపావళి పండగ తిథి గుర్తు చేసుకోండి.
మళ్ళీ వస్తాను.. మీకు తెలిసిన స్లిప్పులిచ్చుకోండి..
Wednesday, June 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
30 comments:
రానారె తిప్పలు పెట్టకుండా గడి ఇవ్వరు నాకు తెలిసి. ఇంకా మొత్తం చూడలేదనుకోండి. రౌడీగారికో విజ్ఞప్తి!
మలక్పేట్ రౌడీ గారు,
మీరు మొత్తం స్లిప్పులూ ఒకేసారి ఇచ్చేస్తే “ఖష్టపడకుండా”నే గడి పూర్తి చేసిన ఫీలింగ్ వచ్చేస్తోంది.(అసలు గడి కంటే మీ స్లిప్పులే పసందుగా ఉంటున్నాయనుకోండి! అది వేరే విషయం)అందువల్ల మచ్చుకు నాలుగో, పదో ఇవ్వండి మొదట. ఎలాగూ మిగిలినవి మాకు తట్టవు కనక(ఇంత మంచి స్లిప్పు దాతలు ఉంటే ఎలా తడతాయీ?) మిమ్మల్నే అడిగి తీసుకుంటాం! ఏమంటారు? అలాగే మిగిలిన వారికి కూడా ఒకటో రెండో స్లిప్పులు పంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
మరి కొన్ని స్లిప్పులు...
4 నిలువు - ఆంధ్రకేసరి
11 నిలువు - బట్టలు నేసే వ్యక్తని అన్న అని పిలిచి చూడండి . ఎంత సంతోషిస్తాడో..
15 నిలువు - శంకరుడి పర్సనల్ వాయిద్యం. ఎవ్వరికి హక్కు లేదు.
16 నిలువు - ఇది లేని వంటా?? ఆంధ్రుకైతే అస్సలు వీలు కాదు..
17 అడ్డం - అన్నమయ్య కీర్తనను ఒక్కసారి తలుచుకోండి. లేదా అన్నమయ్య సినిమాలో నాగార్జున ఏమని శ్రీనివాసుని కీర్తించాడు.. రింగులు తిప్పండి....
20 నిలువు - వజ్రాన్ని కొంచెం నాజూకుగా పలకండి..
34 అడ్డం - ఈ చెట్టుకి ముళ్లు ఉంటాయి. అలాగే జిగురు కూడా తయారు చేస్తారు.
30 నిలువు - పైది వస్తే ఇది ఈజీనే..
Alrite,
Based on the request - I'm not letting any clues out!
మలక్ పేట్ రౌడీ గారి స్లిప్పులు కావలసిందే! గడి కంటే అవే ఎక్కువ మజాగా ఉంటాయి. సుజాత గారు, కావాలంటే మీరు కూడా కొన్ని స్లిప్పులివ్వండి కానీ అంత కష్టపడి స్లిప్పులు తయారు చేసిచ్చే రౌడీగార్ని వద్ద్దనడం ఏం బాగుంది?
భరద్వాజ్ గారు,,
అపార్ధం చేసుకోకండి.... అన్ని స్లిప్పులు ఒకేసారి కాకుండా కొన్ని, కొన్ని ఇవ్వమన్నారు సుజాతగారు. చివరితేదీవరకు కుస్తీపట్టొచ్చని అంతే..
వామ్మో, మలక్పేట్ రౌడీ గారు,
నన్ను తన్నేలా ఉన్నారు జనం! వచ్చెయ్యండి బాబూ!
Hehehe Sujata actually saved me. I could do only 70% of the stuff on the first day and didnt get time to revisit it. So I used her comment to stay away :))
Let me know if you need the Clue for 14 Across ( That seems to be a tough one) and 14 down too
Almost done ... but letting out only a few clues:
15 నిలువు: గీతాంజలి "జగడ జగడ" పాటలో నాగార్జున & బేచ్ పిలుపు ఏమిటి?
14 నిలువు: భీష్ముడికి అర్జునుడు వేసిన డబల్కాట్ మంచం?
14 అడ్డం:
ఆఖరి అయిదక్షరాలూ కర్తవ్యం సినీమాలో తోకతెగిన విలన్ - అర్ధం కాలేదా? సరే "చెంతనాకు నీవే శ్రీరఘురామ" అని పాడుకోండి. కాని దాని మొదలు మాత్రం ఎవరికీ చెప్పకండేం?
25 నిలువు: రజనీకాంత్ కి పుట్టపర్తికీ సంబంధమేంటబ్బా?
17 అడ్డం: ఎవడ్రా నేను పన్నిన కుట్ర తోక తెంచి మధ్యలో కుదించింది? ఆయ్(!!!
26 అడ్డం: ఇంగ్లీషు ప్రెమకు తెలుగు BodyPartని జతచేసి బిర్యానీలో కలపండి
30 నిలువు: బుర్రలేని యెంకమ్మ కులమేది?
19 అడ్డం: ఈ రాక్షసుడి పేరు తలచుకొంటే యముడు గుర్తొస్తాడెందుకో?
44 అడ్డం: గోదావరిఖని చివరికీ, నిడదవోలు మొదటికీ మధ్య దాక్కున్న మన తమిళ సోదరుడు
40 నిలువు: తోకతెగిన స్త్రీ
All the best!!!
నిలువు 21,41,43
అడ్డం 25,45
స్లిప్పులు ఇస్తారా ఎవరైనా?
25 అడ్డం - పాపకాదు - మన మాజీ ముఖ్యమంత్రే
niluvu
41 Baashe yasalo
43mirci tho pasandu aina tiffin
Addam
45 astha nayekale
Ramana gaaru, Dhanyavaadaalu
12 నిలువు
13 నిలువు
21 నిలువు
ఈ మూడు స్లిప్పులు కాస్త దానమిచ్చుకోండి..
12 నిలువు - సంయుక్తరాగము మధ్యలో రెండు పోతే ..... ?
13 నిలువు - క్లూగా ఇచ్చిన వాక్యంలో చివరి నాలుగక్షరాలను సరిగా పేర్చండి.
21 నిలువు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతోంది.
శంకరయ్య గారు థాంక్స్ అండి..
21 నిలువు ఒక్కటే మిగిలింది ??? ఎవరైనా మహాత్ములు ఈ స్లిప్పు ఇచ్చుకోండి...
జ్యోతి,
మిమ్మల్ని స్లిప్పులడిగేకంటే స్క్రీన్ షాట్ పంపమని అడిగితే బాగుంటుందేమోగా!
సుజాతగారు,
అమ్మా! ఆశ , దోశ, బర్గర్, పిజ్జా... ఇంకా వారం ఉంది.. మీకు ఏయే స్లిప్పులు కావాలో అడగండి. చెప్పేస్తాను. చివర్న మిగిలినవి స్క్రీన్ షాట్ పంపిస్తాలెండి. ఐనా ఇలా బహిరంగంగా అడగొచ్చా.???
21 నిలువు- అంబు ధరించినవాడు .. రైటేనా..
జ్యోతి గారూ,
"అంబు" అనేది అచ్చ తెలుగు పదం. దానికి "అమ్ము" అనే రూపాంతరం ఉంది. బాణం అని అర్థం. విలుకాడు అంటే విల్లును ధరించినవాడు. అంతేకాని బాణాన్ని ధరించినవాడు కాదు. సంస్కృత శబ్దం "అంబువు"కు నీరు అని అర్థం. అంబుధరుడు అంటే నీటిని ధరించినవాడు (మేఘుడు) అని అర్థం. ఒకవేళ అంబుధరుడు అనే పదానికి "విలుకాడు" అనే క్లూ ఇస్తే అది తప్పే. గడిని సిద్ధం చేసినవారే సమాధానం చెప్పాలి.
31 అడ్డం.. స్లిప్పు ప్లీజ్. కనీసం ఇది తెలిస్తే 21 నిలువు వస్తుందేమో??
జ్యోతి గారూ,
దేవదాసు సినిమా పాట "జగమే మాయ బ్రతుకే మాయ" చరణం గుర్తుకు తెచ్చుకోండి.
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
అ ఎరుకే నిశ్చలానందమోయ్ ....
వచ్చిందా? రాకుంటేనేకదా బాధ!
శంకరయ్యగారు,
నాకు అది వచ్చింది . దాని ఆధారంగానే 21 నిలువు పదం చెప్తే కాదన్నారుగాః అందుకే మారుద్దామనుకున్నా.. ప్చ్...ఎలా మరి..
శంకరయ్య గారూ,
శబ్దరత్నాకరాన్ని ఆశ్రయించి చూస్తే "అమ్ముకాడు" అనే మాటకు "విలుకాడు"అనే అర్థం ఉంది మరి! ఆ లెక్కన "అంబుధరుడు"అనే మాట కు కూడా 21 నిలువు సరిపోవాలిగా! ఏమంటారు?
మలక్ పేట్ రౌడీ ఎక్కడున్నా..స్టేజీ మీదకు రావలెను. 21 నిలువుకు స్లిప్పు కావలెను.
సుజాత గారూ,
నా దగ్గర శబ్దరత్నాకరం లేదు. సూర్యరాయాంధ్రనిఘంటువులో అమ్ముకాడు, అంబుకాడు అనే పదాలు లేవు. ఒకవేళ మీరన్నట్టు అమ్ముకాడు అంటే విలుకాడు అనే అర్థం ఉంటే దాన్ని అంబుకాడు అనడంలో దోషం లేదు. కాని అంబు అనే అచ్చ తెలుగు పదాన్ని, ధరుడు అనే సంస్కృత పదాన్ని కలిపి సమాసం చేయడం తప్పు. రెండు భిన్న భాషా పదాలను కలిపితే అది వైరిసమాసం అవుతుంది. పండితులకు కోపం వస్తుంది. యమడేంజర్! అయినా అంబుధరుడు అంటే మేఘుడు అని తప్ప మరో అర్థం లేదు. శ్రీ శ్రీ శ్రీ రానారె గారి సమాధానం కోసం చూస్తున్నా. కాకుంటే మలక్ పేట్ రౌడీ గారైనా చెప్పాలి.
శంకరయ్య గారు,
అమ్మో అయితే నేను ఆ వైరి సమాసంతోనే నింపి పంపేశాను. పండితులు తిట్టిపోస్తారేమో! హే రానారే, మరియు రౌడీ, ఈ చిక్కు ముడి విప్పండయ్యా ఎవరైనా, చిన్న క్లూ ఇచ్చి!
శంకరయ్యగారు,
అంబు(బాణము) అన్నది సంస్కృత భవమే అని బ్రౌను, సూర్యరాయాంధ్ర నిఘంటువుల్లో ఉంది. శబ్దరత్నాకరంలో వైకృతమని ఉంది.
అంచేత అంబుధరుడు అన్నది బాణాన్ని ధరించినవాడు అన్న అర్థంలో వాడవచ్చనే అనుకుంటాను. అమ్ముకాడు అంటే విలుకాడు కాబట్టి అంబుధరుడు అన్నా విలుకాడు అనే అర్థం తీసుకోవచ్చనుకుంటున్నాను.
నేను కూడా "అంబు" అనేది సంస్కృత బాణం అని అనుకున్నానండీ. కానీ దుష్ట సమాసమేమో మళ్ళీ ఒకసారి చూసుకుంటా. ఇంతకీ "ధరుడు" పూర్తి సంసృతమే కదా?
"అంబకః" అనే సంస్కృత శబ్దానికి వికృతి "అంబు". దాని అర్థం బాణం. విల్లు కాదు. అయినా అంబు అనే తద్భవ పదంతో భవుడు అనే సంస్కృత పదాన్ని కలిపి సమాసం చేయకూడదు. ఏ రకంగా చూసినా "అంబుధరుడు" అంటే మేఘుడే కాని విలుకాడు అనే అర్థం సరికాదు. రానారె గారెందుకో రంగ ప్రవేశం చేయడం లేదు.
శంకరయ్యగారు,
మీరన్నది నిజమే. అంబు తద్భవం అనుకుంటే అది "అంబకః" శబ్ద భవం అనుకోవాలి. తద్భవ తత్సమాలకి ఎవో కొన్నిచోట్ల మాత్రం మిశ్రసమాసాలున్నాయి కాని "అంబుధరుడు" వ్యాకరణ రీత్యా తప్పే అనుకుంటాను. ఆధారం "దుష్ట విలుకాడు" అని చదువుకుంటే సరిపోతుంది (ఇది కూడా దుష్ట సమాసమే :-).
మీరు ముందన్నట్టు అంబు దేశి పదమే అనడానికి కూడా ఆధారాలున్నాయి. దీని గురించి వెతుకుతూ ఉంటే ఆసక్తికరమైన యీ లంకె దొరికింది:
http://www.harappa.com/arrow/print.html
Post a Comment