ఈ నెల గడి ప్రొఫెసర్ సత్యసాయి గారు తయారు చేసారు. ఇప్పటికైతే కొన్ని స్లిప్పులు ఇచ్చేస్తున్నా. మళ్ళీ వచ్చి మిగతా వాటిసంగతి చూస్తాను..
42 నిలువు - ఈ సినిమాలో చిరంజీవి మొదటిసారిగా పాట పాడి ప్రేమ పాఠాలు చెప్పారు విద్యార్థులకు.
19 నిలువు- పిల్లలు దేవుడు చల్లనివారే ... ఈ పాట ఎక్కడ విన్నారో గుర్తు తెచ్చుకోండి..
18 అడ్డం - జులాబి అని వేణుమాధవ్ అంటాడు అదేనా...
Saturday, May 16, 2009
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
నాలుగయిదు రాలేదు .. అయినా తెలిసినవాటి స్లిప్పులిచ్చేస్తున్నా:
అడ్డం స్లిప్పులు:
1. శ్రద్ధపెట్టి కవిత్రయ విభాగంలో చేరితే మీకు యోగమే యోగం - కావాలంటే భగవద్గీత చదవండి. 16 సార్లు తప్పినా 17వ సారి దొరికేస్తుంది :))
2. తలా తోకా లేని ప్రభాకరుడే
3. ".... పలకవే, ఆ కిటీకీ తెరవవే" - పక్కింటి అమ్మాయితో చంద్రమోహన్ గోల
11. అంతాక్షరి ఆడుతుంటే మీకు "జ" వచ్చిందనుకోండీ. "చెట్టుకింద ప్లీడర్" సినిమాలో ఈ పాటే కదా మీరు పాడేది? అయితే కూర్పరి చెప్పినట్టు చివర్లో "లి" కలాపాలండోయ్!
12. సత్యసాయి గారిని అడిగాను ఇది గోపీకృష్ణ లేక గోపిచందా అని. గోపిచంద్ గనక అయితే ఆయన సినిమా గుర్తు తెచ్చుకోండి
13. వినాయకుడి ఆర్మీ తిరగబడింది
15. నారదుడిలో సగం అంటే పీచా?
16. "కనబడదు, వినబడదు" టైపు మనుషులని ఇలా ముద్దుగా పిలుచుకుంటాం
17. ఇది కొంచం కష్టం. తమ్ముడి తల, జాణ తోక బ్లాగరి మొండెము కలిపి చివర్లో "ము" చేరిస్తే ఎద్దు మీద నీళ్ళూ మోసే తోలు తిత్తి కనిపిస్తుంది
18. ఉత్తరభారతంలో సమోసాలతోపాటు తినే ఉపాహారం - పొద్దున్నే
22. పాపం తాతారావు ని ఎవరో మధ్యకి విరిచేసి చెవి మెలేశారు
24. డాన్ బ్రాడ్ మాన్ కి బాడిలైన్ బౌలింగ్ వేసిన బౌలర్ ఇంటి పేరులో మొదటి అక్షరం మార్చి తెలుగులోకి అనువదించండి
26. అమ్మగార్కి దండం పెట్టు, అయ్యగార్కి దండం పెట్టు, తాతగార్కి దండం పెట్టు, అవ్వగార్కి దండం పెట్టు
28. తోకలు తెగిన రెండు నక్కలు
29. "లేచిందే పరుగు, నల్లాలో మురుగు" టూకీగా
32. చూడు, చూడు
33. బుర్రతక్కువ ఎలుక?
35. ముట్టుకుంటే కందిపోయెవారి చివరి అక్షరం మొదటికొచ్చింది
37. వెయ్యాలా? వేద్దాం; మొయ్యాలా? మోద్దాం; ఇక తియ్యాలా?
38. గుచ్చడానికే కాదు, అప్పుడప్పుడు తవ్వడానికి కూడా వాడే ఇనపకడ్డీ
41. మలయ ..... ????
43. "గాదె కింద పందికొక్కు - గాదెలోన ?????" గబగబా అనండి
44. *** ఇంకా పూర్తిగా రాలేదు ఇది - ప్రయత్నిస్తున్నా ***
45. సత్యసాయి గారు విండోస్ 7 వాడినట్టులేదు. దీనిదగ్గరే ఆగిపోయారు, అది కూడా తిరగబడి
47. *** ఇంకా పూర్తిగా రాలేదు ఇది - ప్రయత్నిస్తున్నా ***
50. ధర్మదాత సినిమాలో ముసలి నాగేశ్వరరావ్ సూపర్ హిట్ పాట - వినలేదా? అయితే పోండి!!
51. *** ఇంకా పూర్తిగా రాలేదు ఇది - ప్రయత్నిస్తున్నా ***
నిలువు స్లిప్పులు:
1. నే చెప్తా, నువ్వు వినుకో
2. తోక తెగి తిరగబడిన సినిమా/పటం?
3. తలలేని ఊయల, తోకలేని ఇలినాయ్ బ్లాగరి కలిస్తే?
4. అబ్బా! ఏమిటీ కడుపుతిప్పుడు?
5. "..... గపదని" అని ఇదివరకు టీవీ లొ మా ఫ్రెండు హోస్ట్ చేసే కార్యక్రమం వచ్చేది (జెమినీలో అనుకుంటా)
6. రోగి కాడు, భోగి కాడు, కత్తి మహేష్ కుమార్ తో పోట్లాడేవాడు
7. మొండెం పోయి తోక కొద్దిగా తెగిన మాజీ బెంగాలీ/భారత క్రికెట్ సారధి
8. భాస్కరభట్లవారి కలం పేరు
9. ఇది 12 అడ్డం బట్టీ ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం వస్తే దీని గురించి మళ్ళీ పోస్టుతా
14. గతి తప్పి గతమైన తర్కం (భౌతికవాదం కూడా), సిధ్ధాంతిగారి ఆశీస్సులతో
19. ఎంత సాఫ్ట్ మైండ్సో!
20. ఇంగ్లీషు కందిరీగలు
21. చక్కగా ఉండే అమ్మలాంటి అమ్మాయా?
22. గోతులు తియ్యకురా! తలక్రిందులుగా పడతావు, పాదాలు తెగిపోయి, మోకాలు సాగిపోయి
23. ప్రేం నగర్ లో జ్యోతిలక్ష్మిని మర్చిపోయారా?
25. పాపం చీమల ఇళ్లని పాములు కబ్జా చేసాయా?
27. ఈ తెలుగు లాంటి ఎలక ఇల్లా? (*** తప్పయినా అయ్యుండవచ్చు - ఇంకా ప్రయత్నిస్తా *** )
30. తల తెగిన ఫిష్, చాలా!!!
31. కాముకుడి మొండెం
34. కుక్క కాదు, బంగారమే
36. శ్రీరంజని రాగంలో మారుపలుకు కోసం త్యాగరాజు అభ్యర్ధన ( *** కొంచం సందేహముంది దీనిలో - సత్యసాయి గారి సమాధానం కోసం వేచి చూస్తున్నా ***)
39. *** సగమే వచ్చింది - ప్రయత్నిస్తున్నా ***
40. *** ఇంకా రాలేదు - ప్రయత్నిస్తున్నా ***
42. చిరంజీవి "క్లాస్ స్టారు" కాదు - మరెవరు?
44. తిరగబడ్డ మూకకి తోక తెగింది
46. *** తప్పో ఒప్పో తెలియదు - అయితే 50 అడ్డం, 45 అడ్డం వచ్చేస్తే ఇది వచ్చేసినట్టేగా? ***
48. వేసవికాలంలో ఇది కాక ఇంకేముంటుంది?
49. ఎన్నికలలో ప్రవహించేది
26 అడ్డం - అమ్మగోర్కి దండం పెట్టు, అయ్యగోర్కి దండం పెట్టు, తాతగోర్కి దండం పెట్టు, అవ్వగోర్కి దండం పెట్టు
సవరణలు:
48 నిలువు: నక్క తోక తెంచి మిగిలినదానిన్ని సాగదీయండి
49 చందముఖి కాదు - మెయిన్ హీరొయినే
47 అడ్డం: "రెయిన్ స్నేకులు"
44 అడ్డం: కళేబరములో రకారము పోయి ళకారము కుదించుకుపోయి తికమకయ్యింది
2 అడ్డాన్ని 8 అడ్డంగా చదువుకోవాలి
Similarly 3 Across is to be read as 10 acrfoss .. oops my bad
రౌడీ రౌడీ ప్లీజ్! కొంచెం మా బుర్రలక్కూడా పని చెప్పనివ్వండి స్వామీ! ఎలాగూ రాకపోతే మిమ్మల్నే అడుగుతాంగా!
OOPS Okay, okay .. I'll step back... :))
40 నిలువు 51 అడ్డం కూడ వచ్చేసినట్టే ఉన్నాయ్ .. ఒకటి చెవుల గోల మరొకటి 1983 క్రికేట్ కేప్టైన్ లాంటి గోల ... ఇంతకన్న వివరంగా చెబితే సుజాతగారు తిడతారేమోనన్న భయంతో చెప్పట్లేదు
And so I think I am done with this month's Gadi
But well, as usual I am not sending it. Let's see who gets it first this time
వామ్మో!! గడి ఆధారాలకంటే ఈ స్లిప్పులే కష్టంగా ఉన్నాయే... నా బుర్ర పనిచేయటంలేదు. సగం కూడా రాలేదు. కాస్త బ్రేక్ తీసుకుని , తర్వాత వస్తాను. ఇంకా నెల టైముందిగా.. :(
@MR,
>>"లేచిందే పరుగు, నల్లాలో మురుగు" టూకీగా
వావ్!
32 అడ్డం, 50 అడ్డం, 8 నిలువు క్లూలు మిస్లీడింగుగా ఉన్నాయి. (లేదా నేనేమైనా మిస్సవుతున్నానో!)
9 నిలువు, 27 నిలువు అడ్డం - మీ జవాబులు సరికావనుకుంటున్నాను.
నాకూ 27 అనుమానమే. అయినా పూర్తిచేసేసి నిన్ననే పంపించేసాను.
Kameswara Rao garu,
I agree. I am still not really sure about 9 and 27 down
32 and 50 across are lil tricky, but I thought 8 down was okay. Lemme checkit again. Thank you
మలక్పేట్ రౌడీ ఎక్కడున్నా స్టేజీ మీదకు రావలెను.
27, నిలువు, అడ్డం తంతున్నాయి. 27 నిలువు చివరి మూడక్షరాలూ వచ్చాయి గానీ మొదటిది రాలేదు. అదొస్తే అడ్డం ఈజీ!
40 నిలువు కు స్లిప్పు ఇచ్చుకునే అవకాశం కూడా ఇస్తున్నా!
సుజాత గారూ,
40 నిలువు - సంస్కృతంలో నాగకర్ణం, ఇంగ్లీషులో స్నేక్ ఇయర్, మరి తెలుగులో ... ?
ఇక 27 నిలువు, అడ్డంలకు మలక్ పేట్ రౌడీ గారే దిక్కు.
27 అడ్డం నేననుకున్న సమాధానం - ఇంగ్లీషు స్థానికమే.
దీనిబట్టి నిలువు వస్తోంది.
ఇది ఎంతవరకు రైటో మాత్రం నేను చెప్పలేను.
OOPS .. నేను ఇచ్చేలోగానే శంకరయ్యగారు కామేశ్వరరావు గారు ఇచ్చేశారు. I have the same answers.
కామేశ్వరరావు గారూ, 27 అడ్డం ఇంగ్లీషు స్థానికులు కాదనుకుంటా. ఉర్దూ స్థానికులేమో? నైజాం రాజ్యంలో స్థానికులను ఇలా పిలిచేవారు. ఇది నాకు తోచిన సమాధానం. కరెక్టో, కాదో? నేనైతే ఈ సమాధానంతో పూర్తిచేసి పంపించాను. చూద్దాం. ఏది కరెక్టో?
Post a Comment